Train Fire: భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:41 AM
Train Fire: మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు. ఇక, ఈ ప్రమాదంలో మనుషులు గాయపడ్డం, చనిపోవటం వంటివి జరగలేదు.

తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గూడ్స్ రైలు తగలబడిపోయింది. ఆ గూడ్స్ రైలు 45 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో చెన్నైలోని ఎన్నోర్ నుంచి ముంబై బయలు దేరింది. ఆదివారం తెల్లవారుజామున తిరువల్లూరు చేరుకుంది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఎగట్టూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఉన్నట్టుండి ఓ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు మిగిలిన ట్యాంకర్లకు వ్యాపించాయి. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
దీంతో గూడ్స్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. చెన్నై నుంచి అరక్కోనమ్ రూటు బ్లాక్ అయింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ అటువైపు వెళ్లే రైలు సర్వీసులను నిలిపేసింది. ఓవర్ హెడ్ పవర్‌ను కూడా ఆపేసింది. రైలు టైమింగ్స్‌లో మార్పులు చేసింది. ఈ మేరకు మారిన రైలు టైమింగ్స్‌కు సంబంధించిన వివరాలపై ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో మనుషులు గాయపడ్డం, చనిపోవటం వంటివి జరగలేదు. ఫైర్ ఇంజిన్లు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు. ఇక, రైలు ప్రమాదం నేపథ్యంలో తిరువల్లూరు జిల్లా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లవద్దని హెచ్చరించారు. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ.. ఇలాంటి శిక్ష వేస్తారనుకోలేదు..
షార్ట్‌కట్‌లో కోటీశ్వరుడు అవ్వడం ఎలా?.. చాట్‌జీపీటీ సూపర్ రిప్లై