Torrential Rains in Himachal Pradesh: హిమపాతం, భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:46 PM
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపానికి జన జీవితం అతలాకుతలం అవుతోంది. ఓవైపు కుండపోత వర్షాలు, మరోవైపు మంచు కురుస్తుండంతో పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జన జీవనం అతలాకుతలమైపోతోంది. గత 12 గంటల్లో కురిసిన కుంభవృష్టికి ఏకంగా జీవనం స్తంభించిపోయింది. ఎత్తున ఉన్న ప్రదేశాల్లో హిమపాతం, దిగువన ఉన్న ప్రాంతాల్లో వర్షం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారీ హిమపాతం కారణంగా లాహూల్ స్పిటీ, ఛంబా-పంగీ, కిన్నౌర్ జిల్లాలకు మార్గాలు మూసుకుపోయాయి. మిగతా ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కులూ, కంగ్రా ప్రాంతంలో క్లౌడ్ బర్ట్స్‌కు అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు (Torrential Rains in Himachal Pradesh).
కిన్నౌ్ర్, కులూ, కంగ్రా, చంబా జిల్లాల్లో కొంత మేర ఆస్టి నష్టం జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. భారీ వర్షం కారణంగా కులూ ప్రాంతంలోని వాగులూ, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. భూతన్‌నాత్ బ్రిడ్జి్ వద్ద ఉన్న భుంటార్ నగర్ మార్కెట్‌లోకి వరద పోటెత్తింది.
Heavy rains: దక్షిణాది జిల్లాలకు భారీ వర్ష సూచన..
షిమ్లా ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకారం, కులూలోని సీబా్ ప్రాంతంలో అత్యధికంగా 116.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూంటర్‌లో 113.2, బంజార్‌లో 112.4, జోగీందర్ నగర్‌లో 112.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, మనాలీలోని కోఠీ ప్రాంతంలో ఏకంగా 130 సెంటీమీటర్ల వర్షం పడంది.
ఆగకుండా పడుతున్న వర్ష పాతం కారణంగా ప్రభుత్వం ఆయా జిల్లాలోని ప్రభుత్వ ప్రేవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే లాహూల్ స్పిటీ, పంగీలో సెలవు ప్రకటించారు.
Tax Revenue: కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత?
ఇదిలా ఉంటే.. రోహ్తక్ పాస్‌లో భారీగా మంచు కురిసింది. ఏకంగా నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. కాక్సార్, అటల్ టన్నెల్ ఉత్తరవైపు ఉన్న ప్రాంతంలో కూడా రెండు అడుగుల మేర మంచుకురిసింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యు్త్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిన్నౌర్, లాహుల్ స్పిటీ జిల్లాలో వర్షానికి అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నారు. వచ్చే నెలలో కూడా ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అన్నారు.