Strongest earthquakes: ప్రపంచాన్ని వణికించిన టాప్ 10 భూకంపాలు ఇవే
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:56 PM
చిలీలోని బియోబియా ప్రాంతంలో 1960 మే 22న రిక్టర్ స్కేలుపై 9.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రపంచంలో ఇంతవరకూ సంభవించిన భూకంపాలలో ఇదే పెద్దది. 1,655 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

న్యూఢిల్లీ: రష్యా తీరంలో అత్యంత బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని వణికించిన 10 అతి బలమైన భారీ భూకంపాలను చూద్దాం.
-చిలీలోని బియోబియా ప్రాంతంలో 1960 మే 22న రిక్టర్ స్కేలుపై 9.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రపంచంలో ఇంతవరకూ సంభవించిన భూకంపాలలో ఇదే పెద్దది. 1,655 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
-అమెరికాలోని అలస్కాలో 1964 మార్చి 27న 9.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. గ్రేట్ అలస్కా ఎర్త్‌క్వేక్ లేదా గుడ్ ఫ్రేడే భూకంపంగా దీనిని పిలుస్తారు. 130 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 2.3 బిలియన్ల ఆస్తినష్టం జరిగింది.
-2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 28,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దక్షిణ ఆసియా, తూర్పు ఆఫ్రికాలోని 11 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
-జపాన్‌లోని తోహాకు ప్రాంతంలో 2011 మార్చి 11న 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్రేట్ తొహోకు భూకంపంగా దీనిని పిలిస్తారు. 15,000 మంది మరణించగా, 1,30,000 మంది నిరాశ్రయులయ్యారు.
-ప్రపంచంలో తొలిసారి 9 తీవ్రతతో 1952 నవంబర్ 4న రష్యాలోని కమ్చట్కూ క్రై ప్రాంతంలో భూకంపం వచ్చింది. భారీ సునామీకి దారితీసి ఒక మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది.
-చిలీలోని బయోబియోలో తిరిగి 2010 ఫిబ్రవరి 27న 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 523 మంది ప్రాణాలు కోల్పోగా, 3,70,000 మంది నిరాశ్రయులయ్యారు.
-1906 జనవరి 31న ఈక్వెడార్-కొలంబియాలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చి సునామీగా మారడంతో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు.
-అమెరికాలోని అలస్కాలో ర్యాట్ దీవులకు సమీపంలో 1965 ఫిబ్రవరి 4న 8.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. 35 అడుగుల ఎత్తులో సునామీ అలలు విరుచుకుపడ్డాయి. రెండు దీవుల్లో స్వల్ప నష్టం జరిగింది.
-1950 ఆగస్టు 15న భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో 8.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. 780 మంది ప్రాణాలు కోల్పోయారు.
-2012లో ఇండోనేషియాలోని ఉత్తర సమత్రా తీరంలో 8.8 తీవ్రతో భూకంప సంభవించింది.
ఇవి కూడా చదవండి..
నన్ను కంట్రోల్ చేయకండి.. కస్సుమన్న జయాబచ్చన్
అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి