Share News

Pragya Thakur: మోదీ పేరు చెప్పమని నన్ను బలవంత పెట్టారు... ప్రజ్ఞా ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:27 PM

మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు గత గురువారంనాడిచ్చిన తీర్పులో ప్రజ్ఞా ఠాగూర్, లెఫ్టినెంట్ కల్నర్ ప్రశాంత్ శ్రీకాంత్ పురోహిత్, మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.

Pragya Thakur: మోదీ పేరు చెప్పమని నన్ను బలవంత పెట్టారు... ప్రజ్ఞా ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు
Pragya Thakur

న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా బయటపడిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ (Prajna Thakur) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendr Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) పేర్లు చెప్పమని ఇన్వెస్టిగేటర్లు తనను బలవంతం చేశారని వెల్లడించారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు గురువారంనాడిచ్చిన తీర్పులో ప్రజ్ఞా ఠాగూర్, లెఫ్టినెంట్ కల్నర్ ప్రశాంత్ శ్రీకాంత్ పురోహిత్, మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.


ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భాగవత్‌ను అరెస్టు చేయాల్సిందిగా సీనియర్ అధికారులు తనకు అదేశాలిచ్చారని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మాజీ అధికారి మహబూబూ ముజావర్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల ఆదేశాలు పాటించేందుకు నిరాకరించడంతో తనపై కేసులు బనాయించారని, అయితే వాటి నుంచి తాను బయటపడ్డానని చెప్పారు. కేసును తప్పుదారి పట్టించేందుకు, సఫ్రాన్ టెర్రర్ కేసుగా ఈ ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞా ఠాకూర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


టార్చర్ పెట్టారు.

ప్రజ్ఞా ఠాగూర్ శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ 'బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్‌తో సహా పలువురు పేర్లు చెప్పమని వాళ్లు (ఇన్వెస్టిగేటర్లు) నన్ను టార్చర్ పెట్టారు. నా ఊపరితిత్తులు దెబ్బతిన్నాయి. అక్రమంగా నన్ను ఆసుపత్రిలో నిర్బంధించారు. ఈ విషయాలన్నీ నేను రాసే స్టోరీలో ఉంటాయి. కానీ నిజాన్ని ఎన్నటికీ దాయలేదు. నేను గుజరాత్‌లో నివసిస్తున్నాను. అందుచేత వాళ్లు నన్ను నరేంద్ర మోదీ పేరు చెప్పమన్నారు. వాళ్ల నాతో అబద్ధం చెప్పించాలనుకుంటున్నందున నేను ఎవరి పేర్లు చెప్పలేదు' అని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్, భాగవత్, ఇంద్రేష్ కుమార్ పేర్లు కూడా చెప్పమని విచారణాధికారులు తనను బలవంతం చేశారని ప్రజ్ఞా ఠాగూర్ చెప్పారు. తాము చెప్పమన్న పేర్లు చెబితే నిన్ను కొట్టమని కూడా వాళ్లు తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ప్రజల్వ్ రేవణ్ణకు జీవిత ఖైదు

ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 05:02 PM