Mango: భారతదేశంలోని ఈ రాష్ట్రంలో పండించే మామిడి పండు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది..
ABN , Publish Date - May 21 , 2025 | 01:00 PM
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లో ఈ పండు ఒకటి. దీని ధర తెలిస్తే షాక్ అవుతారు. కిలో దాదాపు 3 లక్షల వరకు ఉంటుంది.

Mango: మామిడి పండును "పండ్ల రాజు" అని పిలుస్తారు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. మామిడి పండులో పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఈ పండు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. మామిడిలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని మామిడి పండ్ల ధర లక్షల్లో కూడా ఉంటుంది.
బీహార్ రాష్ట్రంలో
మీకు తెలుసా.. భారత్ లోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను బీహార్ రాష్ట్రంలో పండిస్తారు. దాని కిలో ధర రూ. 3 లక్షల వరకు ఉంటుంది. మియాజాకి మామిడి పండు అక్కడ చాలా ఫేమస్. ఇది చాలా తీయ్యగా ఉంటుంది. సహజంగా అధిక చక్కెర కంటెంట్ కలిగి ఉంటుంది. అయితే, దానిని ఉత్పత్తి చేయడం అంత ఈజీ కాదు. ఈ మామిడిని చాలా రేర్‌గా పండిస్తారు. ప్రస్తుతానికి కేవలం కొంతమంది రైతులు మాత్రమే దీనిని సాగు చేస్తున్నారు.
సూర్యుని గుడ్డు
పాట్నా జిల్లాలోని మసౌర్హి బ్లాక్‌లోని కొరియావాన్ గ్రామంలో మియాజాకి మామిడిని సాగు చేస్తున్నారు. ఎక్కువ ధర ఉన్న ఈ మామిడి పండులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని అక్కడ 'సూర్యుని గుడ్డు' అని కూడా పిలుస్తారు. ఇవి లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఈ మామిడి పండుకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, బీహార్‌లోని రైతులు దీని ఉత్పత్తితో రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.
కిలో రూ. 3 లక్షలు
మియాజాకి మామిడిలో అస్సలు ఫైబర్ ఉండదు. మియాజాకి మామిడి పండ్లు కిలోగ్రాముకు రూ. 3 లక్షల వరకు ధర పలుకుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో ఒకటి. బీహార్‌లో, ఈ అరుదైన రకాన్ని పెంచే మొక్కలను బెంగళూరు నుండి తీసుకువస్తారు. ఒక్కో మొక్క ధర దాదాపు రూ. 500. ఈ పండ్ల విలువ ఎక్కువగా ఉండటం వల్ల, రైతులు వాటిని పండించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు. మామిడి పండ్లు దొంగతనం లేదా నష్టం జరగకుండా చూసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో పంటను పర్యవేక్షించడానికి తోటలలో CCTV కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు.
Also Read:
నాటకమాడింది చాలు... నీట్ రద్దు చేయించండి
Weather Updates: దేశవ్యాప్తంగా ఇక వర్షాలే వర్షాలు.. దక్షిణ భారతం సహా కుండపోత..