Tata Group Air India Trust: 500 కోట్లతో టాటా గ్రూపు చారిటబుల్ ట్రస్టు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:18 AM
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం 500 కోట్ల రూపాయలతో ఓ చారిటబుల్ ట్రస్టును..

ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం ఏర్పాటు
న్యూఢిల్లీ, జూలై 18: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం 500 కోట్ల రూపాయలతో ఓ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూపు ప్రకటించింది. ముంబైలో నమోదైన ఆ ట్రస్టుకు టాటా సన్స్, టాటా ట్రస్టుల ద్వారా 250 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి, ప్రమాదంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమైన వారికి ట్రస్టు తక్షణ సహాయం చేస్తుందని టాటా సన్స్ సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం, గాయపడిన వారికి వైద్య సహాయం అందించడంతో పాటు ప్రమాదంలో ధ్వంసమైన బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనం పునర్నిర్మాణానికి సహాయం అందించనున్నట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి