DGP: నూతన పోలీస్ బాస్ కోసం జాబితా సిద్ధం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:48 AM
నూతన పోలీస్ బాస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుత డీజీపీ శంకర్ జివాల్ పదవీకాలం ఆగస్టు 30తో పూర్తి కానుండడంతో నూతన డీజీపీ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితా పంపించేందుకు సన్నాహాలు చేపడుతోంది.

- యూపీఎస్సీకి సీనియర్ల జాబితా పంపనున్న ప్రభుత్వం
చెన్నై: నూతన పోలీస్ బాస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుత డీజీపీ శంకర్ జివాల్(DGP Shankar Jival) పదవీకాలం ఆగస్టు 30తో పూర్తి కానుండడంతో నూతన డీజీపీ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితా పంపించేందుకు సన్నాహాలు చేపడుతోంది. శంకర్ జివాల్ పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని పోలీసు వర్గాలు భావించినా, వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా నూతన పోలీస్ బాస్‌ను ఎంపిక చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఆ జాబితాను త్వరలో యూపీఎస్సీ(UPSC)కి పంపించనుంది. డీజీపీ హోదా కలిగిన ఎనిమిదిమంది సీనియర్ అధికారుల జాబితాలో ముందు వరుసలో సీమా అగర్వాల్, రాజీవ్ కుమార్, సందీప్ రాయ్ రాథోడ్ వున్నారు. అయితే ఈ ముగ్గురూ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. తరువాత ప్రమోద్‌కుమార్, అభయ్ కుమార్ సింగ్ వున్నప్పటికీ వారి పదవీ కాలం ఆరు నెలల కంటే తక్కువే వున్నందున వారి పేర్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునేందుకు అవకాశం లేదు.
ఇక మిగిలింది వన్నియ పెరుమాళ్, మహే్‌షకుమార్ అగర్వాల్, జి.వెంకట్రామన్, వినీత్ దేవాంగ్డే తదితరులు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నదానిపై అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీ్‌సశాఖకు తాజాగా సవాళ్లు వచ్చిపడుతున్న నేపథ్యంలో పోలీ్‌సశాఖను గాడినపెట్టే అధికారికే పగ్గాలు అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest Telangana News and National News