Share News

State Govt: చిరువ్యాపారులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అదేంటో తెలిస్తే..

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:54 AM

గ్రామాల్లో చిరువ్యాపారులకు లైసెన్స్‌ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లోని వాణిజ్య దుకాణాలకు లైసెన్స్‌ ఉన్నట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు కూడా లైసెన్స్‌ పొందాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

State Govt: చిరువ్యాపారులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అదేంటో తెలిస్తే..

- గ్రామాల్లో చిరువ్యాపారులకు లైసెన్స్‌ అవసరం లేదు

- రాష్ట్ర ప్రభుత్వం

చెన్నై: గ్రామాల్లో చిరువ్యాపారులకు లైసెన్స్‌ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లోని వాణిజ్య దుకాణాలకు లైసెన్స్‌ ఉన్నట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు కూడా లైసెన్స్‌ పొందాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ప్రకటించింది. టీ దుకాణాల నుంచి కల్యాణ మండపాల వరకు రూ.250 నుంచి రూ.50,000 వరకు ఫీజుగా చెల్లించి లైసెన్స్‌ పొందాలని సూచించింది.


nani5.2.jpg

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో, ఈ విషయమై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేస్తామని మంత్రి పెరియస్వామి(Minister Periyaswamy) తెలిపారు. అలాగే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపార సంఘాలు కూడా వినతి పత్రం సమర్పించాయి. ఈ క్రమంలో, గ్రామాల్లో చిరు వ్యాపారాలకు లైసెన్స్‌ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


nani5.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 11:17 AM

Updated Date - Aug 01 , 2025 | 11:54 AM