Share News

Governor: పేద మహిళకు గవర్నర్‌ కానుక..

ABN , Publish Date - Jun 28 , 2025 | 10:56 AM

నగరంలో అద్దె ఆటో డ్రైవర్‌గా చాలీచాలని సంపాదనతో ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్న అమల అనే మహిళకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కొత్త ఆటోను కానుకగా అందజేసి ఆమెకు విస్మయం కలిగించారు.

Governor: పేద మహిళకు గవర్నర్‌ కానుక..

- ఆర్‌ఎన్‌ రవి వితరణ

చెన్నై: నగరంలో అద్దె ఆటో డ్రైవర్‌గా చాలీచాలని సంపాదనతో ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్న అమల అనే మహిళకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కొత్త ఆటోను కానుకగా అందజేసి ఆమెకు విస్మయం కలిగించారు. మార్చిలో రాజ్‌భవన్‌(Rajbhavan)లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభలో లేడీ ఆటో డ్రైవర్‌ అమల కుటుంబపోషణ కోసం తాను పడుతున్న కష్టాలను వివరిస్తూ, అద్దె ఆటోను నడుపుతున్న తనకు సొంత ఆటో ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు.


nani1.2.jpg

అమల తమిళంలో మాట్లాడిన మాటల అర్థాన్ని గవర్నర్‌ రవి తన సహాయకుల ద్వారా తెలుసుకున్నారు. ఆమెకు వీలైనంత త్వరగా కొత్త ఆటోను కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గవర్నర్‌ను కలుసుకోవాలంటూ అమల, ఆమె ఇద్దరు పిల్లలకు రాజ్‌భవన్‌ నుంచి పిలుపందింది. ఈ మేరకు అమల, ఆమె ఇద్దరు పిల్లలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మరాద్యపూర్వకంగా కలుసుకున్నప్పుడు ఆ ముగ్గురిని లాన్‌లోకి తీసుకెళ్లి అక్కడే నిలిపి ఉంచిన ఆటోను చూపి ‘ఆ ఆటో నీ సొంతం’ అని చెప్పారు.


గవర్నర్‌ పలికిన ఆ మాటకు అమల ఆశ్చర్యపోయింది. నాలుగు నెలలకు ముందు తాను సభలో చెప్పిన మాటలను గుర్తుంచుకుని, తను పడుతున్న కష్టాలను గుర్తించి ఆటోను కొనిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత గవర్నర్‌ రవి... అమల, ఆమె పిల్లలకు తేనీటి విందునిచ్చి ఆటో తాళాలను అందజేశారు. అమల కొత్త ఆటోలో గవర్నర్‌, తన ఇద్దరు పిల్లలను ఎక్కించుకుని రాజ్‌భవన్‌ అంతటా తిప్పింది. చివరగా గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుని అమల, ఆమె పిల్లలు రాజ్‌భవన్‌ నుంచి కొత్త ఆటోలో ఇంటికి బయలుదేరారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం

ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 28 , 2025 | 10:56 AM