Sleep: సగం మందికి కంటి నిండా నిద్ర కరవు!
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:11 AM
గాఢంగా నిద్రపడితే చాలు.. చాలా రోగాలు దరి చేరవు. రోజుకు ఎనిమిది గంటల పాటు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిద్ర ఉండాలని చాలా మంది ఆశిస్తారు. అయితే దేశంలో 59 శాతం మందికి ఆ అదృష్టం లేదు.

59% మంది భారతీయులకు 6 గంటలకన్నా తక్కువ సేపే..
దోమలు, సెల్‌ఫోన్లు కారణం
న్యూఢిల్లీ, మార్చి 10: గాఢంగా నిద్రపడితే చాలు.. చాలా రోగాలు దరి చేరవు. రోజుకు ఎనిమిది గంటల పాటు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిద్ర ఉండాలని చాలా మంది ఆశిస్తారు. అయితే దేశంలో 59్% మందికి ఆ అదృష్టం లేదు. అంతరాయాలు లేని ఆరు గంటల నిద్ర వారికి కరవయింది. ఈ నెల 14న జరిపే ‘ప్రపంచ నిద్ర దినం’ సందర్భంగా లోకల్ సర్కిల్ సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో భాగంగా 343 జిల్లాల్లోని 40వేల మంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 61ు మంది పురుషులు, 59ు మంది మహిళలు ఉన్నారు. సర్వే ప్రకారం.. 39ు మంది 6-8గంటల పాటు నిద్ర పోతున్నారు. మరో 39 శాతం మంది 4-6 గంటల పాటు పడుకుంటున్నారు.
కేవలం 2% మంది మాత్రమే 8-10 గంటలపాటు నిద్రపోతున్నారు. 20ు మంది నాలుగు గంటల కన్నా తక్కువ సమయంపాటే పడకుంటున్నారు. మొత్తంగా 59ు మందికి ఆటంకాలు లేని ఆరు గంటల నిద్ర కరవయిందని తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం, త్వరగా లేవాల్సి రావడం, దోమల బెడద, సెల్‌ఫోన్‌లు, బయట శబ్దాలు, చిన్న పిల్లల అల్లరి తదితర కారణాల వల్ల సక్రమంగా నిద్ర పట్టడం లేదని పలువురు తెలిపారు. నిద్రలేమి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా చెప్పారు. నిద్రలేని సమస్య భారత్‌లోనే అధికంగా ఉందని అన్నారు.