Lalu Prasad Land Scam Case: లాలు కేసు విచారణపై స్టేకు సుప్రీం నిరాకరణ
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:55 AM
తనపై ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆర్జేడీ అధినేత..

న్యూఢిల్లీ, జూలై 18: తనపై ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ చేసిన వినతిని శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చింది. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు పట్నాలో విలువైన భూములు తీసుకొని అందుకు ప్రతిగా వాటి సొంతదార్లకు రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. మరోవైపు ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాగా, ఈ క్వాష్ పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి