Puja Khedkar: ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?.. పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు
ABN , Publish Date - May 21 , 2025 | 03:20 PM
సివిల్ సర్వీస్ పరీక్షల్లో మోసం, తప్పుడు మార్గాల్లో ఓబీసీ, డిసేబిలిటీ కోటా ప్రయోజనాలను పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది

న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షల్లో మోసం, తప్పుడు మార్గాల్లో ఓబీసీ, డిసేబిలిటీ కోటా ప్రయోజనాలను పొందారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ (Puja Khedkar)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఉపశమనం లభించింది. ఆమెకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని న్యాయమూర్తులు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పూజా ఖేడ్కర్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Operation Sindoor: యుద్ధం అంటే యుద్ధమే.. చిన్నా పెద్దా ఏమిటి?.. ఖర్గేకు కూటమి నేత కౌంటర్
''ఆమె అంతపెద్ద తప్పు ఏమి చేసింది? ఆమె మాదకద్రవ్యాల కింగ్‌పిన్ (Drug Lord) కాదు. టెర్రరిస్టు కాదు. ఆమె 302 హత్యలు చేయలేదు. ఎన్డీపీసీ అఫెండర్ కాదు. ముందు విచారణ పూర్తి చేయండి. ఆమె అన్నీ కోల్పోయారు, ఎక్కడా ఆమెకు ఉద్యోగం కూడా లేదు'' అని బెంచ్ అబిప్రాయపడింది. వాస్తవాలు, పరిస్థితులను పరిశీలించిన దృష్ట్యా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు నుంచి బెయిల్ పొందడానికి ఈ కేసు తగినదిగా భావిస్తున్నామని తెలిపింది.
కాగా, ఖేడ్కర్‌కు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దర్యాప్తునకు ఆమె సహకరిచడం లేదని, ఆమెపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టుకు విన్నవించారు. ఖేడ్కర్ 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, తద్వారా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందారని ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను ఖేడ్కర్ తోసిపుచ్చారు. ఖేడ్కర్‌పై యూపీఎస్సీ పలు చర్యలు తీసుకుంది. ఆమైపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు సైతం పలు అభియోగాలపై ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..
Police Encounter: ఎన్కౌంటర్లో గ్యాంగస్టర్ సభ్యుడికి గాయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి