Share News

Supreme Court: ప్లాట్లు కొన్న వారికి సుప్రీం కోర్టు శుభవార్త..

ABN , Publish Date - Mar 18 , 2025 | 08:02 PM

బిల్డర్స్, డెవలపర్స్‌ కారణంగా సొంతింటి కల కలగానే మిగిలిపోతున్న వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. వారికి అనుకూలంగా తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: ప్లాట్లు కొన్న వారికి సుప్రీం కోర్టు శుభవార్త..
Supreme Court

సొంతిళ్లు కట్టుకోవటం అన్నది ప్రతీ ఒక్కరి కల. ముఖ్యంగా మధ్య తరగతి వారు రూపాయి, రూపాయి కూడబెట్టుకుని లేదా అప్పులు చేసి మరీ సొంతింటి కలను సాకారం చేసుకుంటూ ఉంటారు. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లు కొంటూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు బిల్డర్స్, డెవలపర్స్ కారణంగా కొనుక్కున్న ఫ్లాటు చేతికి రాకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా సొంతటి కల కలలాగే మిగిలిపోతూ ఉంటుంది. అలాంటి వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. బిల్డర్స్, డెవలపర్స్ కారణంగా ఫ్లాట్లు చేతికి రాకుండా ఇబ్బంది పడుతున్న వారికి అనుకూలంగా కామెంట్లు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది.


ఇంతకీ ఏం జరిగింది?..

కొన్ని రోజుల క్రితం కొంతమంది ప్లాట్ల యజమానులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో బిల్డర్స్, డెవలపర్స్ కారణంగా తాము పడుతున్న బాధను విన్నవించుకున్నారు. ఫ్లాట్లు కొని ఏళ్లు గడుస్తున్నా అవి చేతికి రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఈఎమ్ఐ కట్టమని బలవంతం చేస్తున్నాయని వాపోయారు. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఏ సంస్థను మంచిది.. మంచిది కాదు అని చెప్పలేము. కచ్చితంగా సీబీఐ విచారణకు ఆదేశిస్తాము. దీనిపై సీబీఐ రిపోర్టు కోరుతాం.వేల మంది జనం ఏడుస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది.


మేము వారి కన్నీటిని తుడవలేము. కానీ, వారి సమస్యను మాత్రం పరీష్కరిస్తాం. వీలైనంత త్వరగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాం. దీని వెనుక ఎలాంటి మాఫియా లేదని మేము భావిస్తున్నాం. బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. సైట్‌లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు. అయినా కూడా 60 శాతం పేమెంట్ చేసేశారు. ‌సైట్‌లో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఇలా ఏలా చేశారు’ అంటూ బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపురి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. కోర్టు స్పందించిన తీరుతో ఫ్లాట్ల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Updated Date - Mar 18 , 2025 | 08:03 PM