Ballistic Missiles: పృథ్వీ 2, అగ్ని 1 బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:34 AM
Ballistic Missiles: పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. గురువారం ఒడిశా, చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది.

న్యూఢిల్లీ: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. గురువారం ఒడిశా, చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC) ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది. పృథ్వీ 2, అగ్ని 1లు ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను అందుకున్నాయి. దీంతో పరీక్ష విజయవంతం అయింది.
పృథ్వీ 2 మిస్సైల్ ప్రత్యేకతలు
ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీనిని భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని వాడుతుంది. ఈ క్షిపణి రేంజ్ 350 కిలోమీటర్లు. 500 నుంచి 1000 కిలోల బరువును మోసుకెళ్లగలదు.
అగ్ని 1 మిస్సైల్ ప్రత్యేకతలు
ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీనిని భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి రేంజ్ 700 నుంచి 900 కిలోమీటర్లు. ఇది వెయ్యి కిలోల యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. తక్కువ లోడు ఉంటే ఏకంగా 1200 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు.
ఇవి కూడా చదవండి
నడిరోడ్డుపై పాము, ముంగిస పోరు.. గెలుపు దేనిదంటే..
తమ్ముడిపై పగబట్టి.. కారుతో కుటుంబం మొత్తాన్ని..