Share News

Class 10 Exam: టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన తల్లిదండ్రులు

ABN , Publish Date - May 04 , 2025 | 04:56 PM

10 Exam: తాజాగా, పదవ తరగతి పరీక్షలు రాశాడు. కొద్దిరోజుల క్రితమే పదవి తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. అభిషేక్ 600 మార్కులకు గాను కేవలం 200 మాత్రమే తెచ్చుకున్నాడు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఏడిపించారు.

Class 10 Exam: టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన తల్లిదండ్రులు
10 Exam

నా ఉద్దేశ్యంలో చదువు ప్రతీ ఒక్కరికి ఓ అవసరం మాత్రమే.. అదే జీవితం కాదు. పిల్లల్ని బాగా చదువుకోమని చెప్పాలే తప్ప.. చదువుకోకపోతే నీ జీవితం వేస్ట్ అనటం మంచిది కాదు. మంచి మార్కుల కోసం వారి మీద ఒత్తిడి పెట్టడం అంతకంటే మంచిది కాదు. చదువులో ఫెయిల్ అయి ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు చాలా మందే ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల ఒత్తిడే. సాధారణంగా కొడుకు టెన్త్ క్లాసులో ఫెయిల్ అయితే.. తిట్టే తల్లిదండ్రుల్నే ఇప్పటికి వరకు మీరు చూసుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో తల్లిదండ్రులు చాలా డిఫరెంట్.


టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు ఒక్క మాట కూడా అనలేదు. పైగా తమ కొడుకు టెన్త్ ఫెయిల్ అయ్యాడంటూ సెలెబ్రేషన్స్ చేశారు. తల్లిదండ్రులకు స్పూర్తిగా నిలిచే ఈ సంఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అభిషేక్ చోలచ్చగుడ్డ అనే బాలుడు బాగల్‌కోట్‌లోని బసవేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ చదివాడు. తాజాగా, పదవ తరగతి పరీక్షలు రాశాడు. కొద్దిరోజుల క్రితమే పదవి తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. అభిషేక్ 600 మార్కులకు గాను కేవలం 200 మాత్రమే తెచ్చుకున్నాడు.


దీంతో స్నేహితులంతా అతడ్ని ఏడిపించారు. అయితే, టెన్త్ ఫెయిల్ అయిన అభిషేక్‌ను తల్లిదండ్రులు ఏమీ అనలేదు. అందరినీ పిలిచి సెలెబ్రేషన్స్ చేశారు. అభిషేక్‌తో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా అభిషేక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘ నువ్వు పరీక్షల్లో మాత్రమే ఫెయిల్ అయ్యావు. జీవితంలో కాదు. నువ్వు మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉంది. విజయం సాధించే అవకాశం కూడా ఉంది’ అని అన్నారు. తల్లిదండ్రుల మద్దతుతో అభిషేక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ నేను ఫెయిల్ అయినా కూడా నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను మళ్లీ పరీక్ష రాస్తా. విజయం సాధిస్తా.. జీవితంలో కూడా విజయం సాధిస్తా’ అని అన్నాడు.


ఇవి కూడా చదవండి

Viral Video: వస్తువులు తిరిగి తీసుకోలేదని 15 ఏళ్ల బాలిక దారుణం..

Viral Video: పొట్టు పొట్టు కొట్టుకున్న లేడీ ప్రిన్సిపల్, లైబ్రరియన్

Updated Date - May 04 , 2025 | 04:56 PM