Raja Raghuvanshi Case: హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:40 PM
Raja Raghuvanshi Case: మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన నెల రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. భార్య సోనమ్ తన ప్రియుడికోసం రాజాను చంపింది. మేఘాలయకు హనీమూన్‌కు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది.

రాజా రఘువంశీ మర్డర్ కేసుకు సంబంధించి షిల్లాంగ్ కోర్టు ఇద్దరికి బెయిల్ ఇచ్చింది. లోకేంద్ర సింగ్ తోమర్, బల్వీర్ అహిర్వార్‌లకు కోర్టు కండీషన్లతో కూడిన బెయిల్ ఇచ్చింది. రాజా రఘువంశీ మర్డర్ కేసులో ఈ ఇద్దరి ప్రమేయం ఉందన్న అనుమానంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి రిమాండ్‌లో ఉంచి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టు వీరికి కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ కండీషన్లు ఏంటన్నది తెలియరాలేదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తోమర్, అహిర్వార్‌లు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించారని, ఈ ఇద్దరికీ హత్యతో నేరుగా ఎటువంటి సంబంధం లేదని డిఫెన్స్ లాయర్ కోర్టుకు తెలిపారు. డిఫెన్స్ లాయర్ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే, మర్డర్ కేసు నిందితులకు కోర్టు బెయిల్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
కాగా, మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన నెల రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. భార్య సోనమ్ తన ప్రియుడికోసం రాజాను చంపింది. మేఘాలయకు హనీమూన్‌కు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది. సోనమ్ కళ్లముందే నిందితులు రాజాను చంపేశారు. సోనమ్.. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ, ఆ ప్లాన్లు వర్కవుట్ అవ్వలేదు. ముందుగా రాజాను హత్య చేసిన ముగ్గురు దొరికారు. తర్వాత సోనమ్ తనంతటతానే లొంగిపోయింది. పోలీసులు సోనమ్‌తో పాటు ఆమె ప్రియుడ్ని కూడా అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..
ఇతనంటే కందిరీగలకు హడల్.. చేయి పెట్టగానే ఏమైందో చూడండి..