Share News

Raja Raghuvanshi: హనీమూన్‌లో జంట మిస్సింగ్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

ABN , Publish Date - Jun 09 , 2025 | 09:16 AM

Raja Raghuvanshi Case: ఈ కేసులో ఓ టూరిస్ట్ గైడు కీలకంగా మారాడు. మే 23వ తేదీన రాజా, సోనమ్ ఓ ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్లటం తాను చూశానని చెప్పాడు. పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించారు.

Raja Raghuvanshi: హనీమూన్‌లో జంట మిస్సింగ్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..
Raja Raghuvanshi

మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ మర్డర్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ కొత్త ట్విస్ట్ బయటపడింది. రాజా మర్డర్ కేసులో అతడి భార్య సోనమ్ హస్తం ఉన్నట్లు తేలింది. ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లకు డబ్బులు ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. తన గుట్టు రట్టు అవటంతో సోనమ్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. మేఘాలయ పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లైన నెలకే సోనమ్ భర్తను ఎందుకు హత్య చేయించిందన్నది తెలియరాలేదు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.


హనీమూన్‌లో హత్య..

మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ అనే బిజినెస్ మ్యాన్‌కు నెల రోజుల క్రితం సోనమ్ అనే యువతితో పెళ్లైంది. ఇద్దరూ కొన్ని రోజుల క్రితం హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. అక్కడ కాఫీ విషయంలో కాఫీ షాపు సిబ్బందితో రాజా గొడవపడ్డాడు. మే 23వ తేదీన రాజా, సోనమ్ కనిపించకుండా పోయారు. రాజా తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయగా.. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో భయపడిపోయిన వారు మిస్సింగ్ కేసు పెట్టారు. షిల్లాంగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రాజా హత్యకు గురై కనిపించాడు.


టీ షాపు సిబ్బందే అతడిని చంపేసి ఉంటారని అంతా అనుకున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ కేసులో ఓ టూరిస్ట్ గైడు కీలకంగా మారాడు. మే 23వ తేదీన రాజా, సోనమ్ ఓ ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్లటం తాను చూశానని చెప్పాడు. పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఎట్టకేలకు ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు దొరికారు. వారిని మధ్య ప్రదేశ్‌కు చెందిన వారిగా

గుర్తించారు. ఆ ముగ్గర్ని విచారించగా రాజాను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. సోనమ్ తమకు డబ్బులు ఇచ్చి రాజాను హత్య చేయించిందని చెప్పారు. ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ దొరికిపోయారని తెలియటంతో.. సోనమ్ ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులకు లొంగిపోయింది. ఇక, కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు.


ఇవి కూడా చదవండి

మస్క్‌ను కలవరపెడుతున్న మరో సమస్య.. మస్క్‌కు సూర్యుడి దెబ్బ..

అదృష్టం అంటే ఇతడిదే.. తండ్రి చేసిన పనితో లైఫ్ సెటిల్..

Updated Date - Jun 09 , 2025 | 09:49 AM