Share News

Rahul Gandhi: పాక్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాహుల్ గాంధీ ఆర్థిక సాయం

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:13 PM

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన కశ్మీర్ చిన్నారులను ఆదుకునేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వారి చదువులకయ్యే ఖర్చును రాహుల్ గాంధీ భరిస్తానని అన్నారు. ఇందుకు సంబంధించి తొలి విడత నిధులు బుధవారం విడుదల అవుతాయని కశ్మీర్‌ కాంగ్రెస్ చీఫ్ తాజాగా వెల్లడించారు.

Rahul Gandhi: పాక్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాహుల్ గాంధీ ఆర్థిక సాయం
Rahul Gandhi Educational Aid in Poonch

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి తరువాత జరిగిన భారత్, పాక్ ఘర్షణల్లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన కశ్మీర్ చిన్నారుల బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించారు. కుటుంబపెద్దను కోల్పోయిన చిన్నారులకూ రాహుల్ అండగా నిలవనున్నారు. ఈ క్రమంలో పూంచ్‌లో 22 మంది బాధిత చిన్నారుల చదువులకయ్యే ఖర్చును రాహుల్ గాంధీ భరిస్తారని కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారీఖ్ హమీద్ కారా తెలిపారు. ఈ చిన్నారులు పట్టభద్రులయ్యే వరకూ సాయం అందుతుందని తారీఖ్ హమీద్ కారా తెలిపారు. తొలి విడత నిధులు బుధవారం విడుదల చేస్తామని చెప్పారు.

మే నెలలో రాహుల్ గాంధీ పూంచ్‌‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ దాడుల్లో బాధితులైన చిన్నారుల జాబితాను సిద్ధం చేయాలని స్థానిక నాయకులను కోరారు. ఆ తరువాత బాధిత చిన్నారుల తుది జాబితా ప్రభుత్వ రికార్డులతో సరి చూసుకున్నాక సిద్ధమైంది.


పూంచ్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. పాక్ దాడుల్లో స్కూలుకు చెందిన 12 మంది చిన్నారులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. పాక్ దాడులతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పూంచ్ టౌన్ ఒకటి.

ఇదిలా ఉంటే నిన్న పార్లమెంటులో పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత వాయుసేన పలు పాక్ స్థావరాలను ధ్వంసం చేసిందని అన్నారు. చివరకు పాక్ దిగొచ్చి కాల్పుల విరమణను ప్రతిపాదించిందని అన్నారు. ఇక చాలు ఆపేద్దాం అని వారు ప్రకటించారని అన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన సీటులోంచి లేచి.. మీరెందుకు ఆగిపోయారు అని మంత్రిని నిలదీసే ప్రయత్నం చేశారు. దీనికి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీకి ప్రశ్నలు అడిగే హక్కు ఉన్నా ముందు తను చెప్పేది వినాలని అన్నారు. ఈ క్రమంలో ప్రతి పక్ష, ప్రభుత్వ పక్ష ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 29 , 2025 | 12:38 PM