Aircraft Crash: కుప్పకూలిన శిక్షణా విమానం.. పైలట్ మృతి
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:15 PM
అమ్రేలిలోని విజన్ ఫ్లైయింగ్ ఇన్‌స్టిట్యూక్‌కు చెందిన శిక్షణా విమానం మంగళవారంనాడు కుప్పకూలినట్టు డిప్యూటీ ఎస్‌పీ చిరాగ్ దేశాయ్ వివరించారు. విమానంలో ప్రయాణిస్తు్న్న అంకిత్ మహాజన్ అనే వ్యక్తి మృతి చెందినట్టు తెలిపారు.

అహ్మదాబాద్: ప్రైవేటు శిక్షణా విమానం ఒకటి గుజరాత్ (Gujarat)లోని అమ్రేలిలో మంగళవారంనాడు కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మరణించాడు. శాస్త్రినగర్ రెసిడెన్షియల్ ఏరియాలో విమానం పెద్దశబ్ధంతో కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. స్థానికుల భద్రత కోసం ఆ ప్రాంతాన్ని అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
Jammu Kashmir: పహల్గాంలో ఉగ్రదాడి.. గాయపడిన ఏడుగురు టూరిస్టులు
అమ్రేలిలోని విజన్ ఫ్లైయింగ్ ఇన్‌స్టిట్యూక్‌కు చెందిన శిక్షణా విమానం మంగళవారంనాడు కుప్పకూలినట్టు డిప్యూటీ ఎస్‌పీ చిరాగ్ దేశాయ్ వివరించారు. విమానంలో ప్రయాణిస్తు్న్న అంకిత్ మహాజన్ అనే వ్యక్తి మృతి చెందినట్టు తెలిపారు
కాగా, శిక్షణా విమానాలు కుప్పకూలడం నెలరోజుల్లో ఇది రెండోసారి. గత మార్చి 31న ఒక ఫ్లైయింగ్ స్కూలుకు చెందిన శిక్షణా విమానం హెహసానా జిల్లాలోని ఓ శివారు గ్రామంలో కుప్పకూలింది. ఈ ఘటనలో మహిళా పైలట్ గాయపడ్డారు. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇవి కూాడా చదవండి..