Hennur Woman Death Case: గర్భిణి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:39 AM
బెంగళూరు నగర పరిధిలోని హెణ్ణూరు థణిసంద్రలో ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది..

భార్య మృతదేహంతో 3 రోజులు ఇంట్లోనే భర్త
స్థానికులు గమనించడంతో పరారీ
బెంగళూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగర పరిధిలోని హెణ్ణూరు థణిసంద్రలో ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహంతో భర్త ఇంట్లోనే మూడు రోజులపాటు గడిపాడు. ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించారు. దీంతో బుధవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివం, ఆయన భార్య సుమన్ ఆ ఇంట్లో నివసించేవారు. శివం పెయింటింగ్ పనులు చేసేవాడు. మూడురోజుల కిందట సుమన(22) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆ రోజు శివం పనుల కోసం బయటకు వెళ్లాడు. భార్య మృతిచెందాక పనులకు వెళ్లాడా, ఆయన వెళ్లాక ఆమె మృతిచెందిందా అన్నది స్పష్టత లేదు. కానీ ఆ మరుసటి రోజు భార్య మృతదేహం వద్దే శివం గడిపినట్టు, అక్కడే మద్యం సేవించి, భోజనం చేసిన అనవాళ్లు ఉన్నాయు. మూడో రోజు బుధవారం ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో స్థానికులు ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లగా.. శివం ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే వారు హెణ్ణూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుమన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, శివం కోసం గాలిస్తున్నారు. సుమన మృతికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News