Pongal: ఈసారి పొంగల్ కానుక రూ. 5వేలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:23 PM
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రేషన్‌కార్డు దారులకు పొంగల్ కానుకగా రూ. 5వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
- పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రేషన్‌కార్డు దారులకు పొంగల్ కానుకగా రూ. 5వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. 2026 జనవరి రెండో వారంలో జరుపుకోనున్న పొంగల్ పండుగ సందర్భంగా రేషన్‌కార్డుదారులకు పండుగ కానుకగా రూ. 5వేలు అందజేసే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న రాష్ట్ర, కేంద్రప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, చక్కెర కార్డుదారులు పొంగల్ నగదు పొందలేరు.
అయితే ఉచిత బియ్యం పొందుతున్న రేషన్‌కార్డు(Ration Card)దారులకు చౌకదుకాణాల ద్వారా ఈ నగదు పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. పొంగల్ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే కిలో పచ్చిబియ్యం, కిలో చక్కెర, ఒక చెరకుగడ, బెల్లంతో కూడిన కిట్ పంపిణీ జరుగుతుంది. పొంగల్ కోసం తయారుచేసిన చీర, ధోవతులను అన్ని జిల్లాల్లోని పౌరసరఫరాల ప్రధాన కార్యాలయాలకు మరో రెండువారాల్లో తరలించే అవకాశముందని అధికారులు తెలిపారు.

కాగా, రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు, రాయితీలు, కొత్త పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. ఇందువల్ల ఆర్థిక వనరుల పెంపుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇదిలా వుండగా, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మేరకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పొంగల్ కానుకగా అర్హులైన రేషన్‌కార్డుదారులకు పొంగల్ సరుకుల కిట్‌తో పాటు రూ.5వేలు నగదు పంపిణీ చేయడంపై ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భరత్‌రామ్ నుంచి ప్రాణహాని ఉంది
Read Latest Telangana News and National News