Share News

Tigers: పులుల మృతికి విషమే కారణం..

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:30 PM

చామరాజనగర జిల్లా మలె మహదేశ్వర అటవీప్రాంతం గాజనూరు పరిధి హూగ్యంలో ఒక పెద్దపులితోపాటు 4 పులి పిల్ల మృతికి విషమే కారణమని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

Tigers: పులుల మృతికి విషమే కారణం..

- ప్రాథమికంగా గుర్తించిన అటవీశాఖ

బెంగళూరు: చామరాజనగర జిల్లా మలె మహదేశ్వర అటవీప్రాంతం గాజనూరు పరిధి హూగ్యంలో ఒక పెద్దపులితోపాటు 4 పులి పిల్ల మృతికి విషమే కారణమని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మలె మహదేశ్వర కొండల అటవీప్రాంతంలో ఐదు పులులు మృతి చెందినట్టు గురువారం ఫారెస్ట్‌ వాచర్లు గుర్తించారు.


ఐదు పులుల మృతి విషయం తెలియగానే అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రె తీవ్రంగా పరిగణించారు. సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం అటవీశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి, ఫారెస్ట్‌ ఉన్నతాధికారులు ఆదేశాలతో పశువైద్యాధికారులు, ఫారెస్ట్‌ రేంజర్లు పులులు మృతి చెందిన ప్రదేశానికి వెళ్లారు. మంత్రి ఈశ్వర్‌ఖండ్రె(Minister Ishwar Khandre)తోపాటు డీసీఎఫ్‌ చక్రపాణి, నేషనల్‌ టైగర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ అధికారి సంజయ్‌గుబ్బి, ఏపీసీసీఎఫ్‌ శ్రీనివాస్‌, సీసీఎఫ్‌ హీరేలాల్‌ పాల్గొన్నారు.


pandu3.jpg

500 మీటర్ల మేర నిషేధిత ప్రాంతంగా గుర్తించి పరిశీలించారు. ఐదుగురు నిపుణుల బృందం, ఎన్‌టీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా పులులకు పోస్టుమార్టం నిర్వహించారు. పులులు చనిపోయిన ప్రదేశంలోనే ఓ ఆవు కళేబరాన్ని గుర్తించారు. పులుల మృతికి విషమే కారణంగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. తదుపరి దర్యాప్తును అటవీ, పోలీసుశాఖలు సంయుక్తంగా కొనసాగించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం

ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 28 , 2025 | 12:30 PM