PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై మోదీ ఎప్పుడు మాట్లాడతారంటే
ABN , Publish Date - Jul 28 , 2025 | 09:56 PM
రాజ్యసభలోనూ ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై 16 గంటల సేపు చర్చ మంగళవారంనాడు జరుగనుంది. రాజ్యసభలోనూ రక్షణ మంత్రి చర్చను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చర్చలో పాల్గొంటారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sidoor)పై లోక్‌సభలో 16 గంటల చర్చ కొనసాగుతోంది. తొలుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించగా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. కాగా, ప్రధానమంత్రి మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య లోక్‌సభలో మాట్లాడనున్నారు. చర్చకు ముగింపుగా ఆయన మాట్లాడతారని, దీనికి ముందు మధ్యాహ్నం 12 గంటలకు హోం మంత్రి చర్చలో పాల్గొంటారని తెలుస్తోంది.
కాగా, రాజ్యసభలోనూ ఇదే అంశంపై 16 గంటల సేపు చర్చ మంగళవారంనాడు జరుగనుంది. రాజ్యసభలోనూ రక్షణ మంత్రి చర్చను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చర్చలో పాల్గొంటారు.
లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా భారత సైన్యం సత్తాకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. భారత్ సత్తాతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించిందని అన్నారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ (Sindoor) పూర్తి చేశామని, పాక్ మళ్లీ తోకజాడిస్తే ఆపరేషన్ తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. పాక్-భారత్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ సభకు తెలిపారు. మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణలు చోటుచేసుకోలేదన్నారు.
ఇవి కూడా చదవండి..
20 ఏళ్లు మీరు అక్కడే కూర్చోండి.. విపక్షాలపై షా ఫైర్
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..