PM Modi in G20 Summit: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ బిజీ బిజీ.. పలు దేశాల ప్రముఖులతో సమావేశాలు..
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:07 PM
జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నారు.
జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నారు. ప్రధాని మోదీ ఆదివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధానమంత్రి సనే తకైచితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు (PM Modi Meloni meeting).
మెలోనితో జరిగిన సమావేశంలో భారతదేశం, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై ప్రధాని చర్చించారు. మెలోనీని ప్రధాని మోదీ కలవడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. శనివారం, జోహన్నెస్‌బర్గ్‌లోని జీ-20 శిఖరాగ్ర సమావేశ వేదికపై ఇద్దరూ కరచాలనం చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదివారం సమావేశమై పలు అంశాల గురించి చర్చించుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని తకైచితో ప్రధాని సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు. తకైచి జపాన్ ప్రధాని అయిన తర్వాత ఆమెతో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి (Modi Takaichi G20 talks).
కాగా, అంతకుముందు, భారతదేశం, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీని కూడా మోదీ కలిశారు (G20 Summit India diplomacy). గత కొన్ని సంవత్సరాలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే కార్నీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ సమావేశంలో వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు. ఇక, నెదర్లాండ్స్ ప్రధాని డిక్ స్కూఫ్‌తో కూడా మోదీ సమావేశపై పలు అంశాలు చర్చించారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..
ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..