Share News

PM Modi: ప్రధాని మోదీ సిక్కిం పర్యటన రద్దు

ABN , Publish Date - May 29 , 2025 | 11:13 AM

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నుంచి మూడు రోజుల పాటు ఐదు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈరోజు సిక్కింలో ఆయన పర్యటించవలసి ఉంది. అయితే వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని మోదీ పర్యటన రద్దయింది.

 PM Modi: ప్రధాని మోదీ సిక్కిం పర్యటన రద్దు
PM Modi Cancels Sikkim Visit

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సిక్కిం పర్యటన రద్దయింది (Sikkim Visit Cancelled). వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా (Bad Weather Continues) ఆయన సిక్కిం పర్యటన రద్దు అయింది. అయితే సిక్కిం 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా తన సందేశం వినిపించారు. రూ.750 కోట్ల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు.

Also Read: ఐదు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం


కాగా గురువారం నుంచి మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ఐదు రాష్ట్రాలలో (Five State) పర్యటించనున్నారు. 6 బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్ (West Bengal), బిహార్ (Bihar), ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh), మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh)లో ప్రధాని పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై తన సభల్లో ప్రధాని మోదీ ఫోకస్ చేయనున్నారు. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈరోజు మోదీ సిక్కిం పర్యటన రద్దయింది. తర్వాత ఆయన రాష్ట్రాల పర్యటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా..

ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు...

For More AP News and Telugu News

Updated Date - May 29 , 2025 | 11:34 AM