Womans Stomach:అయ్య బాబోయ్.. మహిళ కడుపులో అర మీటర్ గుడ్డ ముక్క
ABN , Publish Date - Apr 25 , 2025 | 08:23 PM
Cloth Found In UP Womans Stomach: నార్మల్ డెలివరీ కుదరదని, సర్జరీ చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. 2023, నవంబర్ 14వ తేదీన ఆమెకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన కొద్దిరోజుల తర్వాత అన్షుల్ ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన నాటి నుంచి ఆమె కడుపులో నొప్పి మొదలైంది.

ఓ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండేళ్ల పాటు నరకం అనుభవించింది. డెలివరీ కోసం వెళ్లిన ఆమె కడుపులో ఓ గుడ్డ ముక్క పెట్టి కుట్టేశాడు. అదేదో చిన్న గుడ్డ ముక్క అనుకునేరు. ఏకంగా అర మీటరు గుడ్డను ఆమె కడుపులో పెట్టి కుట్టేశాడు. దాదాపు రెండేళ్ల పాటు అది మహిళ కడుపులోనే ఉండిపోయింది. కడుపు నొప్పి తట్టుకోలేక సర్జరీ చేయించుకుంటున్న సమయంలో ఆ గుడ్డ ముక్క బయటపడింది. ఆ గుడ్డ ముక్క ఇంకా కొన్నాళ్ల పాటు ఆమె కడుపులోనే ఉండి ఉంటే.. ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అదృష్టం బాగుండి సరైన సమయానికి అది బయటపడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడాకు చెందిన వికాశ్ వర్మ, అన్షుల్ భార్యా భర్తలు. 2023లో అన్షుల్ గర్భం దాల్చింది. నవంబర్ నెలలో ఆమెకు నొప్పులు రావటంతో గ్రేటర్ నోయిడాలోని బస్కన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్షుల్‌కు నార్మల్ డెలివరీ అవుతుందని కుటుంబసభ్యులు భావించారు. అయితే, నార్మల్ డెలివరీ కుదరదని, సర్జరీ చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. 2023, నవంబర్ 14వ తేదీన ఆమెకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన కొద్దిరోజుల తర్వాత అన్షుల్ ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన నాటి నుంచి ఆమె కడుపులో నొప్పి మొదలైంది.
అది కూడా కుట్ల దగ్గర నొప్పి వస్తోందంటూ బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో భర్త ఆమెను డాక్టర్ల చుట్టూ తిప్పేవాడు. వాళ్లు పెయిన్ కిల్లర్లు, మందులు ఇచ్చి సరిపెట్టేవారు. ఎంతకీ కడుపునొప్పి తగ్గకపోవటంతో ఈ సారి కైలాష్ ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు సర్జరీ చేశారు. ఆమె కడుపులో ఏకంగా అర మీటర్ గుడ్డ ముక్క బయటపడింది. డాక్టర్లు షాక్ అయ్యారు. ఇంకొన్నాళ్లు అది అలానే కడుపులో ఉంటే అన్షుల్ ప్రాణాలు పోయేవని అన్నారు. బస్కన్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలంటూ వైద్యాధికారులకు విజ్ఱప్తి చేశారు. అందిన ఫిర్యాదు మేరకు వైద్యాధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం.. స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
Army Nursing College: పాక్ మరో దుశ్చర్య.. ఈ సారి ఆర్మీ కాలేజీ వెబ్ సైట్ హ్యాక్..