Delhi Blast: ఢిల్లీ పేలుడు అంశంపై చర్చకు పార్లమెంటరీ ప్యానల్ నో
ABN , Publish Date - Nov 12 , 2025 | 07:45 PM
ల్లీ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన అంశాన్ని లేవనెత్తేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రయత్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసారు. అయితే అంశంపై చర్చ చేపట్టేందుకు కమిటీ చైర్‌పర్సన్ రాధా మోహన్ దాస్ నిరాకరించారు.
న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో పేలుడు అంశం బుధవారంనాడిక్కడ జరిగిన హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనిపై చర్చించేందుకు చైర్‌పర్సన్ నిరాకరించారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, ఢిల్లీ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన అంశాన్ని లేవనెత్తేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రయత్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసారు. అయితే అంశంపై చర్చ చేపట్టేందుకు కమిటీ చైర్‌పర్సన్ రాధా మోహన్ దాస్ నిరాకరించారు. దీనిపై సుమోటో ప్రకటన చేసేందుకు కూడా నిరాకరించారు.
విపత్తు నిర్వహణ (Disaster Management) ఎజెండాపై పార్లమెంటరీ కమిటీ బుధవారంనాడు సమావేశమైంది. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు హోం మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (NDMA), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ (NIDM), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్ ఫోర్స్ (NDRF) ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ క్యాంప్, హోం గార్డ్స్ డీజీలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి