Panchmukhi Shivling: తవ్వకాలలో బయటపడిన పంచముఖి శివలింగం.. 300 సంవత్సరాల..
ABN , Publish Date - Jul 23 , 2025 | 01:22 PM
ఒక చెరువు తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. దాదాపు ఆరు అడుగుల లోతులో ఉన్న ఈ శివలింగం పాలరాయి రాయితో తయారైంది. ఈ శివలింగం సుమారు..

ఉత్తరప్రదేశ్: బదౌన్ జిల్లాలోని దతగంజ్ ప్రాంతంలో ఒక చెరువు తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం, దతగంజ్ తహసీల్‌లోని సారాయ్ పిపరియా గ్రామంలో చెరువు తవ్వుతుండగా దాదాపు ఆరు అడుగుల లోతులో కనిపించిన ఈ పంచముఖి శివలింగం పాలరాయి రాయితో తయారైనట్లు తెలుస్తోంది.
స్థానిక బ్రహ్మదేవ్ ఆలయ పూజారి మహంత్ పరమాత్మ దాస్ మహారాజ్ మాట్లాడుతూ.. ఈ శివలింగం సుమారు 300 సంవత్సరాల పురాతనమైనదై ఉండొచ్చని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. అక్కడి వారికి ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో పంచముఖి శివలింగానికి పాలతో అభిషేకాలు చేస్తూ పూజలు చేస్తున్నారు.
శివలింగం ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ దర్యాప్తు చేస్తుందని దత్తగంజ్ ఉప జిల్లా మేజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసు, రెవెన్యూ బృందాలు మోహరించాయి. ‘నర్మదా బచావో అభియాన్’కు చెందిన శిప్రా పాఠక్ అనే వ్యక్తి మాట్లాడుతూ, శివలింగం లభ్యమైన ఆ ప్రదేశంలో శివునికి దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి