Share News

Pakistan: భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్‌బేస్‌ల మరమ్మతుకు పాక్ టెండర్లు..

ABN , Publish Date - May 17 , 2025 | 06:24 PM

పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లపై జరిపిన దాడుల్లో భారత్ పైచేయి సాధించినట్టు అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువరించింది. పాక్ అడ్డగోలు వాదనలను కొట్టివేసింది. దాడులకు ముందు, దాడులకు తర్వాత అంటూ 'న్యూయార్క్ టైమ్స్' శాటిలైట్ ఫొటోలతో కథనం ప్రచురించింది.

Pakistan: భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్‌బేస్‌ల మరమ్మతుకు పాక్ టెండర్లు..

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindhoor) పేరుతో భారత్ జరిపిన దాడులను తాము సమర్ధవంతంగా తిప్పికొట్టామని, గెలుపు తమదేనని దబాయించిన పాక్ (Pakistan) బండారం ఎట్టకేలకు బయటపడింది. తమపై భారత్ దాడులు చేయడం నిజమేనంటూ పాక్ తాజాగా ఒప్పుకుంది. ఈ క్రమంలోనే భారత్ దాడుల్లో దెబ్బతిన్న రావల్పిండి సహా పలు కీలక మిలిటరీ బేస్‌లలో మరమ్మతు పనులకు టెండర్ల సైతం పిలిచింది. వీటిలో కల్లర్ కహర్ ఎయిర్ బేస్, రిసాల్‌పూర్ ఎయిర్ బేస్ తదితర ఎయిర్‌బేసులు ఉన్నాయి.

Operation Sindoor: మానవళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ


భారత్‌దే పైచేయి..

మరోవైపు, పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లపై జరిపిన దాడుల్లో భారత్ పైచేయి సాధించినట్టు అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువరించింది. పాక్ అడ్డగోలు వాదనలను కొట్టివేసింది. దాడులకు ముందు, దాడులకు తర్వాత అంటూ 'న్యూయార్క్ టైమ్స్' శాటిలైట్ ఫొటోలతో కథనం ప్రచురించింది. భారత దాడుల్లో పాకిస్థాన్ ఫెసిలిటీస్‌కు భారీ నష్టం జరిగినట్టు ఆ కథనంలో పేర్కొంది.


"భారత్-పాక్ మధ్య నాలుగు రోజులపాటు జరిగిన సైనిక ఘర్షణ గత అర్ధ శతాబ్దంలోనే రెండు అణుదేశాల మధ్య జరిగిన అత్యంత విస్తృతమైన పోరాటం. డ్రోన్లు, క్షిపణులతో ఇరుదేశాలు ఎయిర్ డిఫెన్స్, మిలిటరీ స్థావరాలపై దాడులు చేసుకున్నాయి. ప్రత్యుర్థులను బాగా నష్టపరిచినట్టూ ప్రకటించుకున్నాయి. అయితే పాక్ మిలటరీ ఫెసిలిటీలు, ఎయిర్‌ఫీల్డ్‌లపై జరిపిన దాడుల్లో భారత్ కచ్చితత్వం సాధించినట్టు కనిపిస్తుండగా.. రెండోవైపు (పాక్) దాడులు సింబాలిక్ దాడులుగానే మిగులుతాయి'' ని ఆ కథనం పేర్కొంది.


పాకిస్ధాన్‌పై భారత్ దాడులు విజయవంతమైనట్టు వాషింగ్టన్ పోస్ట్ తన విశ్లేషణాత్మక కథనంలో ధ్రువీకరించింది. విజయం తమదేనంటూ పాక్ చేసిన క్లెయిమ్‌ను ఆ కథనం తోసిపుచ్చింది. ఇండియా దాడుల్లో పాక్‌లోని కనీసం ఆరు ఎయిర్‌ఫీల్డ్స్‌‌లో రన్‌వేలు, స్ట్రక్చర్లు ధ్వంసమయ్యాయని తెలిపింది. దక్షిణాసియాలో ప్రత్యర్థుల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణల్లో పాక్‌పై భారత్ ఈసారి జరిపిన దాడులు చెప్పుకోదగినవంటూ నిపుణులు సైతం విశ్లేషించినట్టు ఆ కథనం పేర్కొంది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలపై విస్తృత స్థాయిలో భారత్ దాడులు జరిపినట్టు అంతర్జాతీయ సంబంధాలపై లండన్‌లోని కింగ్స్ కాలేజీ సీనియర్ లెక్చరర్ చెప్పడాన్ని ఆ కథనం ప్రస్తావించింది.


ఇవీ చదవండి:

Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 07:15 PM