Share News

Operation Sindoor: భొలారి ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన భారత్.. అక్కడేమున్నాయంటే

ABN , Publish Date - May 28 , 2025 | 06:46 PM

భారత్ వైమానికి దాడుల తర్వాత గత మంగళవారంనాడు మాక్సర్ టెక్నాలజీస్ తీసిన ఉహగ్రహ చిత్రాలు పాకిస్తాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి. వీటిలో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదాలోని పీఏఎఫ్ బేస్ ముషాఫ్, భొలారి ఎయిర్ బేస్, జకోబాబాద్‌లోని పీఏఫ్ బేస్ షెహబాజ్ ఉన్నాయి.

Operation Sindoor: భొలారి ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన భారత్.. అక్కడేమున్నాయంటే

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)తో భారత బలగాలు పాక్ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దీంతో పాక్ భారత సరిహద్దు స్థావరాలపై డ్లోన్లు, క్షిపణలతో దాడులకు దిగింది. ఇందుకు ప్రతిగా భారత్ పెద్దఎత్తున జరిపిన వైమానికి దాడుల్లో పలు పాక్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. వీటిలో పాక్‌కు కీలక వైమానిక స్థావరంగా ఉన్న భొలారి ఎయిర్ బేస్ ఒకటి. భారత్ దాడి చేసిన సమయంలో ఈ ఎయిర్‌బేస్‌లో నాలుగు 'వెస్ట్రన్' ఫైటర్ జెట్‌లు, సాబ్ 200 AEW&C ( (Airborne Early Warning and control) ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నట్టు తాజా కథనం వెలువడింది. పోర్ట్ సిటీ కరాచీకి కేవలం 100 మైళ్ల దూరంలో ఈ ఎయిర్‌బేస్ ఉంది.


భొలారి ఎయిర్‌బేస్ ప్రత్యేకత ఏమిటంటే..

పాకిస్థాన్ మిలటరీ కీలక వైమానిక స్థావరాల్లో ఒకటిగా ఈ భొలారి ఎయిర్‌బేస్ ఉంది. ఇది F16A/B బ్లాక్ 15 ADF విమానాలను నడుపుతున్న 19 స్క్వాడ్రన్, ఆపరేషన్ కన్వర్షన్ యూనిట్ (ఓసీయూ)లకు నిలయంగా ఉంది. భారత్ వైమానికి దాడుల తర్వాత గత మంగళవారంనాడు మాక్సర్ టెక్నాలజీస్ తీసిన ఉహగ్రహ చిత్రాలు పాకిస్తాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి. వీటిలో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదాలోని పీఏఎఫ్ బేస్ ముషాఫ్, భొలారి ఎయిర్ బేస్, జకోబాబాద్‌లోని పీఏఫ్ బేస్ షెహబాజ్ ఉన్నాయి.


నాలుగురోజుల పాటు జరిగిన దాడుల్లో భారత వాయుసేన నిర్దిష్ట వ్యూహంతో ఆపరేషన్ నిర్వహించడంతో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు ఇటు భూతలంలోనే కాకుండా అటు గగనతలంలోనూ గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా రెండు పక్షాల మధ్య 9-10 తేదీల మధ్య రాత్రి కీలక దాడులు చోటుచేసుకుని మే 10వ తేదీ వరకూ కొనసాగాయి. భారత బలగాలు దాడికి బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేయడంతో భారత్ అందుకు అంగీకరించింది.


ఇవి కూడా చదవండి..

మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే ఎమ్మెల్యేలు

ఇక భారత్‌ను చూసి పాక్ వణకాల్సిందే..

Read Latest National News and Telugu News

Updated Date - May 28 , 2025 | 09:08 PM