Pakistan: భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల వైపు పాక్ దృష్టి.. అమెరికా థ్రెట్ రిపోర్ట్ వెల్లడి
ABN , Publish Date - May 25 , 2025 | 10:01 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ డిఫెన్స్ ప్రియారిటీలు చైనాకు దీటుగా అంతర్జాతీయ లీడర్‌షిప్‌పై ఫోకస్ చేసే అవకాశం ఉందని, న్యూఢిల్లీ మిలటరీ పవర్‌ను పెంచుకోవడంపై దృష్టి సారించవచ్చని నివేదిక తెలిపింది.

వాషింగ్టన్: పాకిస్తాన్ భారత్‌ను ఒక అస్తిత్వ ముప్పుగా చూస్తోందని, తన అణ్యాయుధాగారాన్ని అధునీకరించుకుంటోందని, భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల వైపు దృష్టి సారిస్తోందని అమెరికా రక్షణ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. 'వరల్డ్‌వైడ్ థ్రెట్ అసెసెమెంట్-2025' పేరుతో విడుదల చేసిన నివేదకలో ఈ వివరాలు తెలిపింది.
Putin: ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పుతిన్
''పాకిస్తాన్ భారత్‌ను తమ అస్తిత్వ ముప్పుగా పరిగణిస్తోంది. అణ్వాయుధాల అభివృద్ధి, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగించనుంది. ముఖ్యంగా అణు పదార్ధాల భద్రత, న్యూక్లియర్ కంట్రోల్ నిర్వహణ, ఆణు ఆయుధాగారాన్ని ఆధునీకరించడం చేస్తోంది. భారీ విధ్వంసం సృష్టించే పదార్ధాలను (డబ్ల్యూఎండీ) విదేశీ సరఫరాదారుల నుంచి, మధ్యవర్తుల నుంచి సేకరిస్తోంది" అని నివేదిక పేర్కొంది. పాక్‌కు ప్రధాన సరఫరాదారుగా చైనా ఉన్నప్పటికీ ఇటీవల పాక్‌లో పనిచేస్తున్న చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగడంతో ఆదేశాల సంబంధాలను దెబ్బతీస్తున్నట్టు తెలిపింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ డిఫెన్స్ ప్రియారిటీలు చైనాకు దీటుగా అంతర్జాతీయ లీడర్‌షిప్‌పై ఫోకస్ చేసే అవకాశం ఉందని, న్యూఢిల్లీ మిలటరీ పవర్‌ను పెంచుకోవడంపై దృష్టి సారించవచ్చని నివేదిక తెలిపింది. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలను నివేదిక ప్రస్తావిస్తూ, ఇటీవల సరిహద్దుల వివాదం విషయంలో బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ వివాదం మాత్రం అపరిష్కృతంగానే ఉందని తెలిపింది. చైనా పలుకుబడిని నిలువరించేందుకు, అంతర్జాతీయంగా నాయకత్వ పాత్రలో మరింత ఎదిగేందుకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యానికి ఇండియా ఎక్కువ ప్రాధాన్యత నిస్తోందని చెప్పింది.
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి