Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఫొటో గ్రాఫర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:48 PM
Pahalgam Terror Attack: దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారికి సాయం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఎన్ఐఏ ప్రాథిమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. నలుగురు టెర్రిస్టులు.. రెండు గ్రూపులుగా విడిపోయారు. రెండు వైపుల నుంచి పర్యాటకులపై కాల్పులు జరిపారు.

జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఉగ్ర మూక 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏంటో కనుక్కుని మరీ చంపేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ముస్లిం వ్యక్తిని కూడా కాల్చేశారు. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేస్తున్నపుడు ఓ ఫొటోగ్రాఫర్ అక్కడే ఉన్నాడు. ఈ దాడినంత తన కెమెరాలో చిత్రీకరించాడు. ఆ ఫొటో గ్రాఫర్ లోయకు వచ్చిన వాళ్లను ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా లోయకి వచ్చి పర్యాటకులను వీడియో తీస్తూ ఉన్నాడు.
అప్పుడే ఉగ్రవాదులు అక్కడికి వచ్చారు. కాల్పులు జరపటం మొదలెట్టారు. దీంతో భయపడిపోయిన ఫొటో గ్రాఫర్ అక్కడినుంచి పరుగులు తీశాడు. బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కాడు. అక్కడే ఓ కొమ్మపై కూర్చుని ఉగ్రదాడినంతా వీడియో తీశాడు. ఆ ఫొటో గ్రాఫర్ ఉగ్రదాడి ఘటనలో కీలక సాక్షిగా మారాడు. ఎన్ఐఏ అధికారులు ఆ ఫొటో గ్రాఫర్‌ను విచారిస్తున్నారు. అతడి వద్దనుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారికి సాయం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి.
నలుగురు టెర్రిస్టులు.. రెండు గ్రూపులుగా విడిపోయారు. రెండు వైపుల నుంచి పర్యాటకులపై కాల్పులు జరిపారు. షాపుల వెనకాల దాక్కున్న ఇద్దరు టెర్రిస్టులు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. అక్కడ ఆహారం తింటున్న వారిని మతం గురించి అడిగారు. తమ మతం కాదని చెప్పగానే చంపేశారు. కొంతమందిని మాత్రం కల్మా చదవమని అడిగారు. వాళ్లు కాదనటంతో చంపేశారు. ప్రతీ ఒక్కరి తలను టార్గెట్ చేసి కాల్చేశారు. ఓ ఇద్దరు టెర్రరిస్టులు నలుగురు పర్యాటకుల తలలపై కాల్చారు. దీంతో అలజడి మొదలైంది. పర్యాటకులు ఇష్టం వచ్చినట్లు పరుగులు తీయటం మొదలెట్టారు. మిగిలిన ఇద్దరు పారిపోతున్న వారిపై కాల్పులు జరిపారు.
ఇవి కూడా చదవండి
Shruti Haasan: లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించిన శృతి
Vijayapura News: సలహా ఇవ్వడమే భర్తకు శాపంగా మారింది..