Share News

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. పిల్లాడి ఆకలి ఆ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడింది

ABN , Publish Date - Apr 29 , 2025 | 07:00 PM

Pahalgam Terror Attack: అందరూ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మ్యాగీ తినటం అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్లు టీ తాగుతున్న సమయంలో కింద లోయలో బుల్లెట్ల వర్షం మొదలైంది.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. పిల్లాడి ఆకలి ఆ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడింది
Pahalgam Terror Attack

జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ప్రకృతి అందాలు చూడ్డానికి వచ్చిన వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. చాలా మంది అదృష్టం బాగుండి ఈ దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డారు. అలాంటి వారిలో కర్ణాటకకు చెందిన ప్రదీప్ హెగ్డే ఫ్యామిలీ కూడా ఒకటి. ప్రదీప్ కొడుకు ఆకలి కారణంగా కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. ఈ ఫ్యామిలీ హోటల్‌లో కూర్చుని తాపీగా టీ తాగుతున్న టైంలో బుల్లెట్ల మోతలు మొదలయ్యాయి.


ఓ వైపు టీ.. మరో వైపు ఉగ్రదాడి..

కర్ణాటకకు చెందిన ప్రదీప్ హెగ్డే, అతడి భార్య శుభ హెగ్డే, వీరి పిల్లాడు సిద్ధాంత్ హెగ్డే ఏప్రిల్ 21వ తేదీన శ్రీనగర్ చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం పహల్గామ్ బయలు దేరారు. వీరందరూ గుర్రాల్లో అక్కడికి వెళుతూ ఉన్నారు. వర్షం పడటం కారణంగా ఆ రోడ్లు మొత్తం బురదతో నిండిపోయి ఉన్నాయి. బైసరన్ కొండపైకి వెళ్లడానికి ఏకంగా 15 నిమిషాలు పట్టింది. జిప్ లైన్ దగ్గరకు చేరుకోగానే ఫొటోలు తీసుకోవటం మొదలెట్టారు. దాదాపు ఓ గంటపాటు అక్కడే ఫొటోలు తీసుకుంటూ గడిపారు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు కిందకు వెళ్లాలని అనుకున్నారు.


అయితే, సిద్దాంత్ తనకు ఆకలిగా ఉందని అన్నాడు. అందరూ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మ్యాగీ తినటం అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్లు టీ తాగుతున్న సమయంలో కింద లోయలో బుల్లెట్ల వర్షం మొదలైంది. వారికి ఆ శబ్ధం వినిపించింది. అయితే, ఆ శబ్ధం బుల్లెట్లదని వారు ఊహించలేదు. జంతువుల్ని భయపెట్టడానికి టపాసులు కాలుస్తున్నారని అనుకున్నారు. సరిగ్గా 20 సెకన్ల తర్వాత గన్నులతో ఉన్న వ్యక్తుల్ని చూశారు. వారు ఆపకుండా పర్యాటకులపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు.


అక్కడ ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు. అర్థం అయిన తర్వాత కిందకు వంగి కూర్చొన్నారు. అప్పుడు ప్రదీప్ భార్యకు బ్యాగు గుర్తుకువచ్చింది. అది టేబుల్ మీద ఉంది. అందులోనే వాళ్ల ఐడీ కార్డులు, ఫోన్లు ఉన్నాయి. వాటి కోసం ఆమె పైకి లేచింది. అప్పుడు ఆమె చెవి దగ్గరగా ఏదో సర్రున దూసుకెళ్లింది. అది బుల్లెట్ అని తెలిసి ఆమె గుండెలు జల్లుమన్నాయి. భర్త, కొడుకు భయపడతారని శుభ వారికి ఆ విషయం చెప్పలేదు. ఇంతలో ఎవరో ‘ అందరూ గేటు వైపు పరిగెత్తండి’ అంటూ కేకలు వేయటం మొదలెట్టారు. ప్రదీప్ ఫ్యామిలీ ఎంతో కష్టంగా గేటు దగ్గరకు వచ్చేసింది. ముష్కరల నుంచి తప్పించుకుంది.


ఇవి కూడా చదవండి

Bhoodan Land Scam: భూదాన్ లాండ్ స్కాం.. ఈడీ సంచలన ప్రకటన

Princess Itka Klet: పోయిన 22 లక్షల రింగ్ తెచ్చిచ్చారు..5 లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు

Updated Date - Apr 29 , 2025 | 07:00 PM