Owaisi: ఇప్పటికీ ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాలంటారా?
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:28 AM
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫారసు

ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఎంఐఎం చీఫ్ ఒవైసీ విమర్శ
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫారసు చేస్తామన్న పాకిస్థాన్‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ ఘనకార్యం చేసినందుకు ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ కోరుకుంటోందా? అని ఆయన ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గత నెలలో భారత్-పాక్ మధ్య ఘర్షణ సందర్భంగా ట్రంప్ జోక్యం చేసుకున్నందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫారసు చేయనున్నట్టు శనివారం పాకిస్థాన్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్‌పై అమెరికా నేరుగా దాడులకు దిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అమెరికా దాడులకు పాల్పడిందని ఒవైసీ అన్నారు. సుమారు 60 లక్షలకు పైగా భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని.. యుద్ధం నేపథ్యంలో ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన కలుగుతోందన్నారు.