Upendra Dwivedi: భారత సైన్యంలోకి ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్... రుద్ర
ABN , Publish Date - Jul 26 , 2025 | 06:25 PM
'రుద్ర' యూనిట్‌లో పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి సేన, ప్రత్యేక దళాలు, మానవరహతి ఏరియల్ యూనిట్లు ఉంటాయని ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో శత్రువులు వణుకు పుట్టించేందుకు లైట్ కమెండో యూనిట్ 'భైరవ్'ను కూడా ఏర్పాటు చేశామన్నారు.

కార్గిల్: భారత సైన్యంలో శక్తివంతమైన దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedei) తెలిపారు. దీనికి 'రుద్ర' (Rudra) అనే పేరు పెట్టామని తెలిపారు. శనివారంనాడు 'కార్గిల్ విజయ దివస్' సందర్భంగా కార్గిల్‌లోని వార్ మెమెరోయిల్ వద్ద ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, శత్రువుల ఆటకట్టించేందుకు, భవిష్యత్ ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆల్ ఆర్మ్ బ్రిగేడ్.. రుద్రను ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి శుక్రవారంనాడు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
'రుద్ర' యూనిట్‌లో పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి సేన, ప్రత్యేక దళాలు, మానవరహిత ఏరియల్ యూనిట్లు ఉంటాయని ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో శత్రువులు వణుకు పుట్టించేందుకు లైట్ కమెండో యూనిట్ 'భైరవ్'ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పదాతిదళం ఇప్పుడు ఒక డ్రోన్ ప్లాటూన్ అని, ఆర్టిలరీలో శక్తిభాన్ రెజిమెంట్ ఉంటుందని, డ్రోన్, కౌంటర్-డ్రోన్, లోయిటరింగ్ మందుగుండు సామగ్రి వంటివి సన్నద్ధంగా ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరగనుందని, స్వదేశీ క్షిపణులతో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు గట్టి సందేశం
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చామని ద్వివేది తెలిపారు. దేశ ప్రజలు ఉంచిన నమ్మకం, ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛతోనే ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా సర్జికల్ దాడులు జరిపిందన్నారు. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, ప్రజలకు హానిచేయాలని చూసేవారికి గట్టి సమాధానం ఇచ్చితీరుతామన్నారు.
కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
నితీష్‌కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా... కేంద్ర మంత్రి నిప్పులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి