Share News

Kerala Jail Escape: ఒంటిచేత్తో 20 అడుగుల గోడ దూకి

ABN , Publish Date - Jul 26 , 2025 | 03:43 AM

కదులుతున్న రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై హత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న..

Kerala Jail Escape: ఒంటిచేత్తో 20 అడుగుల గోడ దూకి

  • కేరళలో జీవిత ఖైదీ పరార్‌.. గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

న్యూఢిల్లీ, జూలై 25: కదులుతున్న రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై హత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గోవింద స్వామి(41) కేరళలోని కన్నూర్‌ కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం పరారయ్యాడు. గతంలో ఓ చెయ్యి కోల్పోయి దివ్యాంగుడైన గోవిందస్వామి తన ఒంటి చేత్తో 20 అడుగుల ఎత్తైన జైలు ప్రహారీ గోడను దాటి తప్పించుకున్నాడు. జైలులో తానున్న బ్యారక్‌ కటకటాల్లోని కొన్ని ఊచల్లోని కొంత భాగాన్ని రంపపు బ్లేడుతో కత్తించి ఆ సందులో నుంచి గోవింద స్వామి బయటికొచ్చాడు. తర్వాత దుస్తులను ఒక దానికి మరొకటి కట్టి ముందే సిద్ధం చేసుకున్న తాడుతో 20 అడుగల ఎత్తైన ప్రహరీ గోడను ఒంటి చేత్తో దాటేశాడు. ఆపై, జైలు దుస్తులు విడిచి వెంట తెచ్చుకున్న వేరే దుస్తులను వేసుకుని పరారయ్యాడు. అయితే, గోవిందస్వామి ఓ పాడుబడిన ఇంట్లో ఉన్నట్టు పోలీసులు సీసీ కెమెరాలు, జాగిలాల సాయంతో గుర్తించారు. అతడు అక్కడున్న బావిలో దూకి దాక్కోగా.. బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:43 AM