Red Fort Attack: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. పేలుడుకు ముందు వీడియో రికార్డ్ చేసిన ఉమర్
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:54 AM
నవంబర్ 10వ తేదీన ఉమర్ నబీ అనే వ్యక్తి ఎర్రకోట దగ్గర ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 13 మంది చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మురం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీ వీడియో బయటపడింది. ఎర్రకోట వద్ద కారు బాంబు దాడికి పాల్పడడానికి ముందు ఉమర్ ఆ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ ఆ వీడియోలో మాట్లాడినట్లు సమాచారం. ‘ఆత్మాహుతి దాడిని అపార్థం చేసుకున్నారు. ఇదొక బలిదానం’ అని చెప్పినట్లు తెలుస్తోంది.
చనిపోయే స్థలం, సమయం, పరిస్థితుల గురించి కూడా ఉమర్ నబీ మాట్లాడినట్లు సమాచారం. నవంబర్ 9వ తేదీన అల్ఫల యూనివర్సిటీలో ఉమర్ వీడియో రికార్డు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరుసటి రోజు నవంబర్ 10వ తేదీన అతడు ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇందుకోసం ఐ20 కారును ఉపయోగించాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఉమర్‌కు సహకరించిన అతడి బంధువుతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నాయి.
సంఘటనా స్థలంలో దొరికిన 3 కాట్రిడ్జ్‌లు
పేలుడు సంభవించిన ప్రదేశంలో అధికారులకు మూడు 9 ఎమ్ఎమ్ కాట్రిడ్జ్‌లు దొరికాయి. వాటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు కాగా.. మరొకటి ఖాళీ షెల్. బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కాట్రిడ్జ్‌లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశ్యంతో ఆ మూడు కాట్రిడ్జ్‌లను అక్కడ పడేసి పోయారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
షాకింగ్.. సిక్స్ ప్యాక్ కోసం పిచ్చి పని.. చైనా వ్యక్తి ఏం చేశాడంటే..
అతడిని చూసి నేర్చుకోండి: గావస్కర్