Share News

Honeymoon Murders Case: రాజా హత్యకేసులో వెలుగుచూసిన మరో కొత్తపేరు

ABN , Publish Date - Jun 18 , 2025 | 02:55 PM

మేఘాలయలోని తూర్పు ఖాసి హిల్స్‌ జిల్లాలో రాజాపై దాడి చేసి హత్య చేశారు. వీ సావ్‌డాంగ్ జలపాతం సమీపంలో అతని మృతదేహాన్ని విసిరేశారు. పది రోజుల తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Honeymoon Murders Case: రాజా హత్యకేసులో వెలుగుచూసిన మరో కొత్తపేరు
Honeymoon Murder Case

న్యూఢిల్లీ: మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి దారుణ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారి రాజా రఘవంశి (Raja Raghuvanshi) కేసు మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో మరో కొత్త పేరు వెలుగుచూసింది. అతన్ని సంజయ్ వర్మ అనే వ్యక్తిగా గుర్తించారు. రాజా-సోనమ్ పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా సంజయ్ వర్మ, సోనమ్ అనేక మార్లు టెలిఫోన్‌లో మాట్లాడుకున్నట్టు గుర్తించారు. పోలీసుల కాల్ డాటా ప్రకారం మార్చి 1వ తేదీ నుంచి మార్చి 25 వరకూ సోనమ్, సంజయ్‌లు 119 సార్లు మాట్లాడుకున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది.


మేఘాలయలోని తూర్పు ఖాసి హిల్స్‌ జిల్లాలో రాజాపై దాడి చేసి హత్య చేశారు. వీ సావ్‌డాంగ్ జలపాతం సమీపంలో అతని మృతదేహాన్ని విసిరేశారు. పది రోజుల తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


టైమ్‌లైన్ ఇలా...

మే 11: రాజా, సోనమ్‌ల పెళ్లి ఇండోర్‌లో జరిగింది.

మే 21: షిల్లాంగ్‌కు జంటగా వచ్చారు.

మే 22: షిల్లాంగ్‌లోని కీటింగ్ రోడ్డులో స్కూటీ అద్దెకు తీసుకుని సోహ్రా వెళ్లారు.

మే 23: నాన్‌గ్రియట్ గ్రామం సమీపంలో ఇద్దరూ ట్రెక్కింగ్ చేశారు. చివరిసారిగా రాజా కనిపించిన సందర్భం ఇదే.

మే 24: సోహ్రారిమ్‌లో స్కూటర్ వదిలేసినట్టు కనుగొన్నారు.

జూన్ 2: వీ సావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయలో కుళ్లిపోయిన దశలో ఉన్న రాజా మృతదేహాన్ని కనుగొన్నారు.

జూన్ 7-8: నిందితులను అరెస్టు చేయగా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్‌లో సోనమ్ లొంగిపోయింది.


పోలీసుల కథనం ప్రకారం, రాజా హత్య కోసం కిరాయికి మాట్లాడుకున్న వ్యక్తుల్లో ఒకరైన విశాల్ సింగ్ చౌహాన్ ఒక కొడవలి వంటి పదునైన ఆయుధంతో రాజాపై దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సోనమ్ తన భర్త రక్తస్రావంతో అరుస్తుండటంతో అక్కడి నుంచి పారిపోయింది. కిరాయి గూండాలు పలుమార్లు దాడిచేసి రాజాను హత్య చేసిన తర్వాత ఆమె తిరిగి అక్కడికి వచ్చింది. ఈ హత్యకు సోనమ్ కుట్ర పన్నడమే కాకుండా దాడికి సంకేతాలు ఇవ్వడంతో పాటు మృతదేహాన్ని డిస్పోజ్ చేసేందుకు కూడా సహకరించింది.


వీ సావ్‌డాంగ్ జలపాత ప్రాంతం రిమోట్ ఏరియా కావడంతో ఆ ప్రాంతాన్ని హత్యకు ఎంచుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితుల్లో ఏ ఒక్కరూ గతంలో ఆ ప్రాంతానికి వెళ్లలేదు. రాజా మృతదేహం కనిపించిన చేటే హత్యకు ఉపయోగించిన రెండో ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్య సమయంలో ఆకాష్ రాజ్‌పుట్‌ ధరించినట్టు అనుమానిస్తున్న ఒక తెలుపు చొక్కా కూడా అక్కడే దొరికింది.


ఇవి కూడా చదవండి..

కన్న కొడుకు ముందే తల్లి దారుణం.. ఎంతకు తెగించిందంటే..

హడావుడే.. తొక్కిసలాటకు కారణం.. ఆ ముగ్గురూ రాజీనామా చేయాలి

For More National News

Updated Date - Jun 18 , 2025 | 04:15 PM