Chennai: ‘కరుణానిధి’ పేరుతో కొత్త విశ్వవిద్యాలయం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:00 PM
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుతో ఓ కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఈ వర్సిటీకి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ వర్సిటీ పరిధిలోకి 17 కళాశాలలు వస్తాయి.

- ఆ వర్సిటీ పరిధిలో 17 కళాశాలలు
- అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి కొవి చెళియన్
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) పేరుతో తంజావూరు జిల్లా కుంభకోణంలో కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి శాసనసభలో సోమవారం ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెళియన్ ముసాయిదా చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇటీవల శాసనసభలో డీఎంకే మిత్రపక్షాల సభ్యులు మాజీ ముఖ్యమంత్రులు కామరాజర్, అన్నాదురై ఎంజీఆర్, జయలలిత పేర్లతో విశ్వవిద్యాలయాలున్నాయని, విద్యారంగానికి విశేష కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుతో విశ్వవిద్యాలయం లేకపోవడం శోచనీయమన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
ఆ సభ్యుల డిమాండ్‌పై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ తంజావూరు జిల్లా కుంభకోణంలో కరుణానిధి పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈమేరకు శాసనసభలో మంత్రి కొవి చెళియన్ ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ ప్రకారం అరియలూరు, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు జిల్లాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించటం కోసం ఈ ‘కలైంజర్ విశ్వవిద్యాలయం’ ఏర్పాటవుతుందని చెప్పారు.
ఈ విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. కుంభకోణం ప్రభుత్వ కళాశాల, తంజావూరు రాజా సర్బోజీ ప్రభుత్వ కళాశాల, తిరువారూరులోని తిరువిక ప్రభుత్వ కళాశాల, కుడైవాసల్ పురట్చితలైవర్ ఎంజీఆర్ ప్రభుత్వ కళాశాల సహా 17 కళాశాలలు ఈ కొత్త విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయని మంత్రి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు
డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?
చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ
Read Latest Telangana News and National News