Netra Wedding: తెలుగమ్మాయి పెళ్లికి ట్రంప్ కొడుకు, జెన్నిఫర్ లోపెజ్..
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:17 PM
తెలుగమ్మాయి నేత్ర మంతెన పెళ్లికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ వచ్చారు. అతనేకాదు, హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ కూడా పెళ్లికి వచ్చి ఆడి పాడుతున్నారు. ఉదయపూర్లో జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ (శుక్రవారం) నుంచి నవంబర్ 24 వరకు జరగననున్న నేత్ర మంతెన పెళ్లితో ఇప్పుడు ప్రపంచం దృష్టి రాజస్థాన్లోని ఉదయపూర్ మీద పడింది. ఇంతకీ ఎవరీ నేత్ర అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు.. అమెరికన్ బిలియనీర్ రామరాజు మంతెన కుమార్తె. ఆమె టెక్ ఇన్నోవేటర్ వంశీ గాదిరాజును పెళ్లి చేసుకుంటున్నారు.
ఈ పెళ్లికి ట్రంప్ తనయుడితోపాటు ఇంటర్నేషనల్ స్టార్స్ జన్నిఫర్ లోపెజ్, జస్టిస్ బీబర్, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్ వంటి అనేక మంది తారలు ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవుతున్నారు. నేత్ర మంతెన తన ప్రొఫైల్ ను చాలా ప్రైవేట్ గా ఉంచుతారు. ఆమె తండ్రి మంతెన రామరాజు అమెరికాకు చెందిన బిలియనీర్. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న కుటుంబం వీరిది.
మంతెన రామరాజు అమెరికాకు చెందిన ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ (Ingenus Pharmaceuticals) చైర్మన్, ఇంకా CEO. ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ICORE Healthcare, OncoScripts వంటి గ్లోబల్ హెల్త్ కేర్ వెంచర్లకూ యజమాని. యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్, భారతదేశం అంతటా విస్తరించి ఉన్న వ్యాపారాలతో మంతెన రామరాజు ప్రపంచ ఫార్మా రంగంలో ఒక లెజెండ్.
ఇక వరుడి వివరాలికొస్తే, పేరు వంశీ గాదిరాజు. ఇతను టెక్కీ. సూపర్ ఆర్డర్ సహవ్యవస్థాపకుడు, కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. కొలంబియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందారు. ఇతని కంపెనీ ప్రఖ్యాత సూపర్ ఆర్డర్ అనే యాప్ ను రూపొందించింది. 2024లో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో (Food & Drink category) చోటు సంపాదించాడు. ప్రస్తుతం సూపర్ ఆర్డర్ విలువ $18–25 మిలియన్ల మధ్య ఉండొచ్చని అంచనా.
వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణిస్తున్న ఈ పెళ్లి.. పిచోలా సరస్సుపై రాజ వైభవానికి ప్రతీకైన జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లలో జరుగుతోంది. చారిత్రాత్మక సిటీ ప్యాలెస్‌లోని లీలా ప్యాలెస్ మానెక్ చౌక్, జెనానా మహళ్లలో ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News