Love Obsession: వివాహితపై పిచ్చి ప్రేమ.. ఆమె భర్తను చంపేసి...
ABN , Publish Date - Jul 23 , 2025 | 09:51 PM
Love Obsession: పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు. ఇందుకు ఫాతిమా ఒప్పుకోవటం లేదు. దీంతో ఫాతిమా భర్తను టార్గెట్ చేశాడు. అతడే లేకపోతే ఫాతిమా తనను పెళ్లి చేసుకుంటుందని భావించాడు.

ఓ యువకుడు పెళ్లైన మహిళను ప్రేమించాడు. పెళ్లి చేసుకోమని ఆమె వెంటపడ్డాడు. ఆఖరికి ఆమె కోసం ఆమె భర్తనే చంపేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. వాసీకి చెందిన 25 ఏళ్ల ఫాతిమా మండల్, 35 ఏళ్ల అబుబకర్ సుహాది మండల్ భార్యాభర్తలు. వీరికి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల అమినుల్ అలీ అహ్మద్.. ఫాతిమాను ప్రేమిస్తున్నాడు.
పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు. ఇందుకు ఫాతిమా ఒప్పుకోవటం లేదు. దీంతో ఫాతిమా భర్తను టార్గెట్ చేశాడు. అతడే లేకపోతే ఫాతిమా తనను పెళ్లి చేసుకుంటుందని భావించాడు. మర్డర్ ప్లాన్ వేశాడు. సోమవారం పనికి వెళ్లిన అబుబకర్‌ను చంపేశాడు. రాత్రయినా భర్త ఇంటికి రాకపోవటంతో ఫాతిమా పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అమినుల్.. అబుబకర్‌ను చంపేసినట్లు తేలింది.
నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అబుబకర్‌ను చంపి ఓ చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. అతడి బట్టలు, ఇతర వస్తువులు మురికి కాల్వలో పడేసినట్లు వెల్లడించాడు. బుధవారం అబుబకర్ శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అమినుల్‌పై మర్డర్ కేసు నమోదు చేశారు. అతడికి సాయం చేశారని భావిస్తున్న మిత్రుల కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సైకోగా మారిన వన్‌సైడ్ లవర్.. యువతిపై కక్ష గట్టి..
తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ఎస్‌ఐ.. ఏకంగా సీనియర్లపై..