Jan Sadharan Express Derails: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:02 PM
Jan Sadharan Express Derails: బోగీలు పట్టాలు తప్పిన సమయలో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం వినపడగానే కొంతమంది ప్రయాణికులు భయపడిపోయారు. రైలులోంచి కిందకు దూకేశారు. అయినప్పటికీ వారికీ ఏమీ కాలేదు.

జనసధరన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ముజఫర్‌పుర్ జంక్షన్ నుంచి సబర్మతీ బీజీ జంక్షన్‌కు వెళుతుండగా అహ్మదాబాద్‌లోని భౌపుర్ స్టేషన్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4.12 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు మెల్లగా వెలుతుండటంతో కేవలం 6, 7 నెంబర్ బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. రైలు ఎక్కువ దూరం వెళ్లకుండా ఆగిపోయింది.
అయితే, బోగీలు పట్టాలు తప్పిన సమయలో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం వినపడగానే కొంతమంది ప్రయాణికులు భయపడిపోయారు. రైలులోంచి కిందకు దూకేశారు. అయినప్పటికీ వారికి ఏమీ కాలేదు. జనసధరన్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు సెంట్రల్ స్టేషన్‌కు రావాల్సి ఉంది. అయితే, రెండు గంటలు ఆలస్యంగా.. 3.07 గంటలకు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంది. సెంట్రల్ రైల్వే స్టేషన్‌నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఇక, సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బోగీలను పట్టాలు ఎక్కించే ఏర్పాట్లు మొదలెట్టారు. ఇక, ప్రమాదం గురించి తెలియటంతో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం వచ్చి చేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పట్టాలు తప్పిన బోగీల దగ్గర జనం పెద్ద ఎత్తున గుమి గూడి ఉన్నారు. సెల్ ఫోన్ టార్చులు వేసి పరిశీలిస్తూ ఉన్నారు. ఇక, రైలులోని ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయి ఉన్నారు. ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
అనిల్ అంబానీకి షాక్.. లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన ఈడీః
తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ