Share News

Floods 2005: నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి

ABN , Publish Date - Jul 26 , 2025 | 06:02 PM

Floods 2005: నగరం నీట మునిగిన రోజు కేవలం 24 గంటల్లో ఏకంగా 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు 644 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Floods 2005: నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి
Floods 2005

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ భారత దేశంతో పోల్చుకుంటే.. ఉత్తర భారత దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. మరీ ముఖ్యంగా ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 44 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై మొత్తం నీట మునిగిపోయింది. గతంలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం కారణంగా తలెత్తే పరిస్థితి.. ఇప్పుడు 30నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతానికే సంభవిస్తోంది.


20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి..

ముంబై నగరం నీటిలో మునిగిపోయిన ఈ నేపథ్యంలో.. నెటిజన్లు 20 ఏళ్ల కింద జరిగిన ఓ విషాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆ విషాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ విషాదం ఇంకేదో కాదు.. 2005లో ముంబై నగరాన్ని ముంచెత్తిన వరదలు. 2005 జులై 26వ తేదీన మహానగరం నీట మునిగిపోయింది. ఈ రోజుతో సరిగ్గా 20 ఏళ్లు అయింది. 20 ఏళ్లు గడుస్తున్నా.. శాస్త్రసాంకేతికత పరంగా ఎంత అభివృద్ధి చెందినా.. ముంబై పరిస్థితుల్లో ఏ మార్పు లేదంటూ జనాలు మండిపడుతున్నారు.


ఆ నాటి దారుణ పరిస్థితులు

నగరం నీట మునిగిన రోజు కేవలం 24 గంటల్లో ఏకంగా 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు 644 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. నగరం మొత్తం నీట మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ నదుల్ని తలపించాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. 14000 వేల ఇళ్లు నేల మట్టం అయ్యాయి. దాదాపు 1000 మంది దాకా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

కింగ్‌డమ్ మూవీకి తిప్పలు.. తిరుపతిలో నిరసన సెగ

థాయ్‌లాండ్, కంబోడియా మధ్య యుద్ధం.. ఈ ఏరియాలకు అస్సలు వెళ్లకండి..

Updated Date - Jul 26 , 2025 | 06:02 PM