Share News

FIR For Feeding Pigeons: కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:47 PM

FIR For Feeding Pigeons: హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.

FIR For Feeding Pigeons: కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..
FIR For Feeding Pigeons

జంతు ప్రేమికులకు నిజంగా ఇది షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇకపై పబ్లిక్‌లో పావురాలకు తిండిపెడితే జైలు శిక్ష తప్పదు. తాజాగా, ఓ వ్యక్తి పావురాలకు తిండిపెట్టి కేసులో చిక్కుకున్నాడు. అయితే, అది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదులెండి. మహారాష్ట్రలోని ముంబై నగరంలో. ముంబై హైకోర్టు జులై 31వ తేదీన బ్రిహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్‌సీ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో పావురాలకు తిండిపెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పింది.


ముంబై హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రజల ఆరోగ్యం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కొత్త రూల్ గురించి ప్రజలకు తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి స్కూటీపై ఎల్‌జీ రోడ్డులోని ఖాబూతర్ఖానా దగ్గరకు వచ్చాడు. సంచుల్లో తెచ్చిన దానాను అక్కడి పావురాలకు వేశాడు.


అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. కొత్త రూల్ తెచ్చిన తర్వాత పావురాలకు తిండి పెట్టి.. కేసులో చిక్కుకున్న మొదటి వ్యక్తి అతడే కావటం గమనార్హం. ఆ కొత్త రూల్ గురించి తెలియక ఎంత మంది జైలు పాలవుతారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి

బాలిక ఫొటోలు స్టేటస్ పెట్టిన యువకుడు.. చావగొట్టిన అన్న..

మానవత్వం అంటే ఇది.. 200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లి..

Updated Date - Aug 03 , 2025 | 08:26 PM