Ambanis in KumbhMela: కుంభమేళాలో పాల్గొన్న ముఖేశ్ అంబానీ కుటుంబం!
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:32 PM
కుంభమేళాలో పాల్గొనేందుకు ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో సహా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. ముఖేశ్ అంబానీ వెంటనే ఆయన తల్లి కోకిలాబెన్, తనయులు అనంత్, ఆకాశ్, మనవళ్లు, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మహా కుంభమేళాలో పాల్గొనేందుకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ముఖేశ్ అంబానీతో పాటు ఆయన తల్లి కోకిలా బెన్, కుమారులు అనంత్ ఆకాశ్ అంబానీ, ఆకాశ్ సతీమణి శ్లోకా మెహతా, వారి ఇద్దరు కుమారులు పృథ్వి, వేదా వెరసి అంబానీ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వ్యక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వారు అరైల్ ఘాట్ వద్ద పుణ్యస్నానానికి వెళ్లారు. కొకిలా బెన్ వెంట ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు (Ambanis in KumbhMela).
ఇదిలా ఉంటే కుంభమేళాలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిలయన్స్ ఫౌండేషన్ ‘తీర్థయాత్ర సేవ’ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు పోషకాహారం, అత్యవసర వైద్య సేవలు, రవాణా సదుపాయాలు, కనెక్టివిటీ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చింది.
Narendra Modi: భారత్ ఇంధన పరివర్తన.. ప్రపంచ గేమ్ ఛేంజర్
కుంభమేళా యాత్రికుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ మొత్తం ఎనిమిది కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పోషకాహారం, పరిశుభ్రమైన నీరు అందించేందుకు ‘అన్న సేవ’, భక్తుల ఆరోగ్యం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య సేవలు, ఓపీడీలు, డెంటల్ కేర్ సదుపాయాలు, మహిళలకు ఉచిత శానిటరీ నాప్‌కిన్లు అందిస్తోంది. ప్రయాగ్‌రాజ్ నుంచి త్రివేణి సంగమం వరకూ ప్రయాణికులను తరలించేందుకు విద్యుత్ వాహనాలు, గోల్ఫ్ కార్టులను అందుబాటులో ఉంచింది. ఇక పుణ్యస్నానాల సమయంలో భక్తుల భద్రత కోసం లైఫ్ జాకెట్స్ కూడా అందిస్తోంది. యాత్ర సమయంలో భక్తులు సేద తీరేందుకు కాంపా ఆశ్రమాలను ఏర్పాటు చేసింది. యాత్రికులకు ఎల్లవేళలా మెరుగైన ఫోన్ సేవలు అందుబాటులో ఉండేలా అదనపు 4జీ, 5జీ బీటీఎస్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతమున్న సదుపాయాలను మరింత మెరుగు పరిచింది. కీలక ప్రాంతాల్లో మొబైల్ టవర్లు, చిన్న సెల్ స్టేషన్లను కూడా నెలకొల్పింది.
ఇక భద్రతా విధుల్లో ఉన్న పోలీసు బలగాల కోసం రిలయన్స్ వాటర్ బూత్స్‌లు ఏర్పాటు చేసింది. సిబ్బంది విధులకు అవసరమైన బారికేడ్లు, నిఘా కోసం వినియోగించే వాచ్ టవర్లను కూడా అందించింది. దీంతో పాటు స్థానిక ఆధ్యాత్మిక సంస్థలైన శారదాపీఠ్ మఠ్ ట్రస్ట్, శ్రీ శంకరాచార్య ఉత్సవ్ సేవాలయ ఫౌండేషన్, నిరంజనీ అఖాడాలతో కలిసి పలు ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..