Share News

Meghalaya Honeymoon Murder: మేఘాలయ మర్డర్ కేసులో మరో ట్విస్ట్

ABN , Publish Date - Jun 29 , 2025 | 06:58 PM

మేఘాలయ మర్డర్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న షిల్లాంగ్ పోలీసులు, సోనమ్ స్నేహితుడు, ఈ కేసులో మరో నిందితుడైన షిలోమ్ జేమ్స్‌ను వెంటబెట్టుకుని మధ్యప్రదేశ్‌లోని రత్లాం అనే ప్రాంతానికి చేరుకున్నారు.

Meghalaya Honeymoon Murder: మేఘాలయ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
Meghalaya Honeymoon Murder

Meghalaya Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య, కేసులో ప్రధాన నిందితురాలు అయిన సోనమ్ బ్యాగ్‌ను తగలబెట్టి, ఆధారాలను నాశనం చేశారంటూ నమోదైన కేసుకు సంబంధించి షిల్లాంగ్ పోలీసులు మరో కీలక ఆధారాల్ని సేకరించారు. ఈ కేసులో సోనమ్ స్నేహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన షిలోమ్ జేమ్స్‌ మరో ముద్దాయిగా ఉన్న సంగతి తెలిసిందే. రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత సోమన్‌కు సంబంధించిన సాక్ష్యాల తాలూకు ఆనవాళ్లను నాశనం చేయడంలో షిలోమ్ జేమ్స్.. సోనమ్‌కు సహకరించాడన్న సంగతి పోలీసులు ఇప్పటికే కనుగొన్నారు.

Meghalaya-murder-case.jpgఅయితే, దీనిపై మరింత లోతుగా కూపీలాగుతున్న షిల్లాంగ్ పోలీసులు షిలోమ్ జేమ్స్‌ను వెంటబెట్టుకుని మధ్యప్రదేశ్‌లోని రత్లాం అనే ప్రాంతానికి చేరుకున్నారు. స్థానిక మంగళ్ మూర్తి కాలనీలోని సదరు ఇంటిపై షిల్లాంగ్ పోలీసులు, జేమ్స్‌ను వెంటబెట్టుకుని దాడి చేశారు. ఆ ఇంటి నుంచి రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత సోనమ్ బ్యాగ్‌లో ఉంచిన నగలు, డబ్బు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంటిని కేసులో మరో నిందితుడైన విశాల్ చౌహాన్‌కు జేమ్స్ అద్దెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటన్నది త్వరలోనే పోలీసులకు పూర్తి క్లారిటీ రాబోతోంది. నిందితులు జేమ్స్, తోమర్, అహిర్వార్ ప్రస్తుతం మేఘాలయ పోలీసుల ట్రాన్సిట్ కస్టడీలో ఉన్నారు.


ఇలా ఉండగా, రాజా హత్య కేసుకు సంబంధించి షిలోమ్ జేమ్స్ ప్రమేయం మీద ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాల్ని సేకరించారు. జేమ్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. పలాసియా ఏరియాలోని మురుగుకాలువ నుంచి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ను పోలీసులు గతంలోనే వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్‌ను వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్‌లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది. ఇందులో నాటు తుపాకీ ఉన్నట్టు సమాచారం.

Meghalaya-murder-case--1.jpgఇక ఈ హత్యకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళితే.. రాజా రఘువంశీ, సోనమ్ వివాహం గత మే 11న జరిగింది. హనీమూన్ కోసం మే 23న ఇద్దరూ కలిసి మేఘాలయ వచ్చారు. జూన్ 2న ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లా సోహ్రా ప్రాంతంలోని ఒక లోతైన గుంటలో రాజా రఘువంశీ మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం హత్య కేసులో ప్రమేయం ఉన్న సోనమ్, ఆమె బాయ్‌ఫ్రెండ్ కుష్వాహతో పాటు హత్యోదతంలో పాల్గొన్న సహ నిందితులు విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం మేఘాలయలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.


ఇవీ చదవండి:

ఆర్సీబీ క్రికెటర్‌పై యువతి ఫిర్యాదు

నీరజ్‌కు మళ్లీ టాప్‌ ర్యాంక్‌

లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 06:58 PM