Share News

MEA: పతనమైన ఆర్థిక వ్యవస్థలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందనిదే

ABN , Publish Date - Aug 01 , 2025 | 07:48 PM

భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం నాడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. భారత్-అమెరికా దేశాల భాగస్వామ్యం అనేక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని ఇందుకు అనుగుణంగానే ముఖ్యమైన ఎజెండాపైనే తాము దృష్టి సారించామని చెప్పారు.

MEA: పతనమైన ఆర్థిక వ్యవస్థలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందనిదే
Modi with Trumph

న్యూఢిల్లీ: భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు విధించడంతో పాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆచితూచి స్పందించింది. ఆ రెండు దేశాలు (Russia-India) పతనమైన ఆర్థిక వ్యవస్థలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చెప్పడానికి ఏమీ లేదని భారత్ పేర్కొంది. ముఖ్యమైన ఎజెండాపైనే తమ రెండు దేశాలు దృష్టి సారించాయని, అదే విధంగా రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.


Randhir-Jaiswal.jpg

భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం నాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్-అమెరికా దేశాల భాగస్వామ్యం అనేక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే ముఖ్యమైన ఎజెండాపైనే తాము దృష్టి సారించామని చెప్పారు. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాల్లో అమెరికాతో భారత్ బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఇవి మరింత బలపడ్డాయని చెప్పారు.


ఏ రెండు దేశాల మధ్య సంబంధాలు మూడో దేశం కోణంలో చూడకూడదని, వివిధ దేశాలతో మన సంబంధాలు వేటికవే సొంత అర్హతలు కలిగి ఉన్నాయని జైశ్వాల్ అన్నారు. భారత్-రష్యా సంబంధాలపై మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య నిలకడైన సంబంధాలు ఉన్నాయని, కాలపరీక్షకు నిలిచిన భాగస్వామ్యం తమదని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని, దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంతో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని భారత్ ముందుకెళ్తుంటుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు.. మాజీ పోలీసు అధికారి వెల్లడి

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. తప్పుపట్టిన ఈసీ

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 08:33 PM