Share News

Bengaluru News: పెళ్లయినా ప్రేమించాలని వేధింపులు.. యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:50 PM

పెళ్లయినా వేధింపులకు గురి చేశాడా ఆ వ్యక్తి. అంతేకాక తన మాట వినకపోతే తనతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వేధింపులు తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివాహితుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Bengaluru News: పెళ్లయినా ప్రేమించాలని వేధింపులు.. యువతి ఆత్మహత్య

బెంగళూరు: పెళ్లయినా వేధింపులకు గురి చేశాడా ఆ వ్యక్తి. అంతేకాక తన మాట వినకపోతే తనతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వేధింపులు తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివాహితుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తుమకూరు(Tumakuru) జిల్లాలో చోటు చేసుకుంది. గుబ్బితాలూకా గ్యారహళ్ళి గ్రామానికి చెందిన భావన(22) నెలమంగళలోని చిన్నమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


గ్యారహళ్ళికి చెందిన నవీన్‌(Naveen)కు ఇప్పటికే పెళ్ళి జరిగింది. కానీ భావనను ప్రేమించాలని వేధిస్తుండేవాడు. గతంలో ఇద్దరు తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతుండటంతో భావన భయపడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భావన మైసూరులో చదువుతున్న వేళ తండ్రి తరచూ ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపేవారు. తండ్రి వద్ద ఫోన్‌పే లేని కారణంగా ఇదే గ్రామానికి చెందిన నవీన్‌ మొబైల్‌ ద్వారా ఆయన డబ్బు పంపేవారు. ఇలా సేకరించిన ఫోన్‌ నంబరుతో నవీన్‌ తొలుత స్నేహం పెంచుకున్నాడు.


అప్పట్లో ఇద్దరు కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఇటీవల చదువు ముగించుకుని వచ్చిన భావన(Bhavana) స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. నవీన్‌తో స్నేహం ఇష్టం లేదని చెబుతున్నా పట్టించుకోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ జరిపి మరోసారి వేదిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా నవీన్‌ నిత్యం ఇబ్బంది పెడుతుండేవాడని, అదే కారణంతోనే భావన బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. నెలమంగళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా నవీన్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 12:50 PM