Maoists: ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు లేఖ.. ఛత్తీస్‌ఘడ్ డీజీపీ ప్రెస్ మీట్
ABN , First Publish Date - 2025-05-14T17:28:45+05:30 IST
చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్

Maoists Letter ఛత్తీస్‌ఘడ్: చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ రిలీజ్ చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. గౌరవనీయులైన మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని ఆ లేఖలో కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ఆపరేషన్ కగార్‌ను ఆపడానికి ముందుకు రండిని సదరు లేఖలో కోరారు. శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ముందుకు రండి...అంటూ అటు పౌర హక్కుల ప్రజాస్వామ్యవాదులకు కూడా మావోయిస్ట్ పార్టీ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.
ఇలా ఉండగా, 'ఆపరేషన్ కగార్' పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కేంద్రం. అయితే, భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది ప్రభుత్వం. ఇక, తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ఎప్పుటి నుంచో చెబుతూ వస్తున్నారు. మరోవైపు శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆంటూ పౌర హక్కుల సంఘాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.
ఇవి కూడా చదవండి
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
అద్భుతమైన మంచు నది