Snake: మెడలో పాముతో మద్యం దుకాణానికి వచ్చి..
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:00 PM
ధర్మపురి జిల్లాలో ఓ తాగుబోతు చేసిన పనికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లాలోని ఫోర్ రోడ్స్ సమీపంలో టాస్మాక్ మద్యం షాపు ఉండగా, ఓ యువకుడు మెడలో పాము వేసుకుని వచ్చాడు.

చెన్నై: ధర్మపురి జిల్లాలో ఓ తాగుబోతు చేసిన పనికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లాలోని ఫోర్ రోడ్స్ సమీపంలో టాస్మాక్ మద్యం షాపు ఉండగా, ఓ యువకుడు మెడలో పాము వేసుకుని వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. టాస్మాక్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువకుడు అడిగిన మద్యాన్ని ఇచ్చి వెళ్ళిపోవాలని కోరారు.
అయితే, ఆ యువకుడు మాత్రం అక్కడే మద్యాన్ని తాను తాగడంతో పాటు పాముకు తాగించుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే, మెడలో పాముతో నడిచి వెళుతున్న ఆ తాగుబోతును చూసి పాదాచారులు, స్థానికులు భయపడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ యువకుడుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ
రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు
Read Latest Telangana News and National News